యేసయ్యా నా ప్రియా

Yesayya Naa Priya (యేసయ్యా నా ప్రియా) Song Lyrics

యేసయ్యా నాప్రియా !

ఎపుడో నీ రాకడ సమయం

1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2

దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2

|| యేసయ్యా||

2. మరపురాని నిందలలో – మనసున మండే మంటలలో -2

మమతను చూపిన నీ శిలువను – మరచిపోదునా నీ రాకను -2

|| యేసయ్యా ||

  1. ప్రియుడా నిన్ను చూడాలని – ప్రియ నీవలెనే మారాలని

ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే                            || యేసయ్యా ||

నేను వెళ్ళే మార్గము

Nenu Velle Margamu ( నేను వెళ్ళే మార్గము) Song Lyrics

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

  1. కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున -2

గురిలేని తరుణాన వేరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

  1. జలములలో బడి నేను వెళ్ళినా – అవి నా మీద పారవు -2

అగ్నిలో నేను నడచినను – జ్వాలలు నను కాల్చజాలవు -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

  1. విశ్వాస నావ సాగుచూ – పయనించు సమయాన నా ప్రభూ -2

సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవ నా ప్రభు -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును