ఆనంద యాత్ర – హోసన్నా మినిస్ట్రీస్

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర              ||ఆనంద యాత్ర||

యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2)    ||ఆనంద యాత్ర||

రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2)     ||ఆనంద యాత్ర||

కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||

ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం     ||ఆనంద యాత్ర||

కృపామయుడా – Hosanna Ministries songs

కృపామయుడా నీలోన – krupamayuda nelona song lyrics

కృపామయుడా నీలోనా (2)

నివసింప చేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం – నీలో (2)
ఏ అపాయము నా గుడారము
సమీపించ నీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2)                     ” కృపా “
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజ వంశములో
యాజకత్వము చేసెదను (2)                 ” కృపా “
నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నాపైన  నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2)               ” కృపా “
ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీట మిచ్చుటకు  (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృప గా మారెను (2)               ” కృపా “