Prabhuva padedha noka sthuti geetam
preminchi rakshinchitivi
1. Gata vathsarambulona – kaapadi nadipinavu
nutana vathsaramuna – sthutiyimpa chesinavu “Prabhuva”
2. Yesayya palikitivi – aa samudra pongulalo
nisshabdhamuga yoora – kundumu nimmalamuga “Prabhuva”
3. Bhayapadina shishulato – rayamuna palikitivi
bhayapadakudi nene – achairyamu thechchukonudi “Prabhuva”
4. Thuphanu rege thvarlo – tarangamulu leche
Aapitivayyaa devaa – apada bapitivi “Prabhuva”
5. Mundlaku badulu gonji – devadarulu molachu
undunu soochanalugaa – nityampu khyaatigaanu “Prabhuva”
6. Abhivrudhi jesedavu – prabhuvaina yesu deva
adhikambu melulato munupatikante marala “Prabhuva”
7. Siluvalo ma tuphaanu balilo bharinchitivi
halleluya padedanu – caluvari yesu nadhaa “Prabhuva”
ప్రభువా పాడెద నొక స్తుతి గీతం – ప్రేమించి రక్షించితివి
1. గత వత్సరంబులోన – కాపాడి నడిపినావు
నూతన వత్సరమున – స్తుతియింప చేసినావు
|| ప్రభువా ||
2. యేసయ్యా పలికితివి – ఆ సముద్ర పొంగులలో
నిశ్శబ్దముగా యూర – కొండుము నిమ్మళముగా
|| ప్రభువా ||
3. భయపడిన శిష్యులతో – రయమున పలికితివి
భయపడకుడి నేనే – ధైర్యము తెచ్చుకొనుడి
|| ప్రభువా ||
4. తుఫాను రేగె త్వరలో – తరంగములు లేచె
ఆపితివయ్యా దేవా – ఆపద బాపితివి
|| ప్రభువా ||
5. ముండ్లకు బదులు గొంజి – దేవదారులు మొలచు
ఉండును సూచనలుగా – నిత్యంపు ఖ్యాతిగాను
|| ప్రభువా ||
6. అభివృద్ధి జేసెదవు – ప్రభువైన యేసు దేవా
అధికంబు మేలులతో – మునుపటి కంటె మరల
|| ప్రభువా ||
7. సిలువలో మా తుఫాను – బలిలో భరించితివి
హల్లెలూయ పాడెదను – కలువరి యేసు నాథా
|| ప్రభువా ||