“ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.” కీర్తన Psalm 103:2
పల్లవి : శ్రీ యేసు నాథుని శిరసావహించి
శిష్యుల మేసును ఘనపరచెదము
1. పాపుల రక్షింఫ నవనికి వచ్చెను
ఏపుగా కౌగలించి సన్నుతించెదము
|| శ్రీ యేసు ||
2. డెంద మేసునిచేత హర్షము బొందె
అందమగు యేసును స్తుతించెదము
|| శ్రీ యేసు ||
3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెను
భీకర ధ్వనితోడ భజియించెదము
|| శ్రీ యేసు ||
4. మరణపు ముల్లును విరచి జయించిన
కరుణాబ్ధి యేసుని స్మరియించెదము
|| శ్రీ యేసు ||
5. దూరస్థులగు వారలను చెంత చేర్చెను
నిరతము యేసుని సన్నుతించెదము
|| శ్రీ యేసు ||
6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి
శక్తిగల యేసును స్తుతియించెదము
|| శ్రీ యేసు ||
Psalm -103:2
Sis nawaye Prabhu vandan karte
Pallavi : Shree yesu naadhuni shirasaa vahinchi
shishyula mesuni ghana parachedamu
1. Paapula rakshimpa navaniki vachchenu –
epugaa kaugalinchi sannuthinchedamu “Shree yesu”
2. Denda mesuni chetha harshamu bonde
andamagu yesuni stutinchedamu “Shree yesu”
3. Paapa koopamu nundi eththi rakshinchenu
bheekara dwani thoda bhajiyinchedamu “Shree yesu”
4. Maranapu mullunu virachi jayainchina
karunaabdi yesuni smariyinchedamu “Shree yesu”
5. Doorastulagu vaaralanu chentha cherchenu
nirathamu yesuni sannuthinchedamu “Shree yesu”
6. Rakhtitho Halleluya aanandamutho paadi
shakhtigala Yesunu stutiyinchedamu “Shree yesu”