క్రీస్తు నీ ద్వారము చేరి – విస్తార దీవెన లొందితిని

పల్లవి : యేసు తృప్తి పరచితివి – ఆశతో నీ చరణము చేర

1. క్రీస్తు నీ ద్వారము చేరి – విస్తార దీవెన లొందితిని
నీదు అపార కృపచేత – నాదు హృదయము కడిగితివి
|| యేసు ||

2. నా జీవము విడిపించితివి – నీ జీవము సిలువ నిడితివి
సైతానును ఓడించితివి – నా యెదలో వసియించితివి
|| యేసు ||

3. నీ లక్షణములు ఆశ్చర్యం – అక్షయ మహిమను గాంచితిని
రక్షణానందము నొంది – వీక్షించితిని నిను నిశ్చయమే
|| యేసు ||

4. నీదు పాదము చేరిన నాడే – నాదు పాపము బాపితివే
మది నుపకారాత్మను బొంది – పదిలముగా ప్రణుతించెద
|| యేసు ||

5. నిన్ను నమ్మిన నీదు దాసుని – పెన్నుగ తన యురితెంపితివే
ధన్య ధన్య అమరనివాసి – దర్శనమిచ్చి గాచితివే
|| యేసు ||

సాగిలపడి ఆరాధించెదము

“సాగిలపడి ఆయనను పూజించిరి.” మత్తయి Matthew 2:1

పల్లవి : సాగిలపడి ఆరాధించెదము
సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్

1. దూతలు కనబడి గానము చేసిరి
సతతము మహిమ సర్వోన్నతునికి
శాంతియు భువిలో పరిశుద్ధులకు
పావనుడేసుని పూజించెదము
|| సాగిలపడి ||

2. గొల్లలు గాంచిరి ఘనకాపరిని
ఉల్లములెల్లను రంజిల్లగను
ఎల్లరకు చాటిరి వల్లభుని
ఉల్లాసముతో కొనియాడెదము
|| సాగిలపడి ||

3. జ్ఞానులు గనిరి ఘనమగు తారన్
పూనికతో పయనము గావించి
కానుకలిడి పూజించిరి రాజున్
తనివి తీరగ ఘనపరచెదము
|| సాగిలపడి ||

4. మరియ ప్రభుదయ విరివిగ బొంది
ప్రణుతించెను ప్రభు దర్శనమొంది
పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు
మురియుచు మదిలో మ్రొక్కెద మిపుడే
|| సాగిలపడి ||

5. సుమెయోను స్తుతియించె దేవుని
గమనించె ఘన రక్షణ నరులకు
నిర్మల వెలుగు నిర్మల మహిమ
విమలుని మరి మరి స్తుతియించెదము
|| సాగిలపడి ||

6. వివరించెనన్న విమోచకుని
విశ్వాసులకు పరిశుద్ధులకు
దేవుని స్తుతియించుచు నీ భువిలో
పవిత్రుని బహు పూజించెదము
|| సాగిలపడి ||

7. పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు
రాజులరాజు ప్రభువుల ప్రభువు
రాజ్యము నిచ్చెన్ రాజుల జేసెను
విజయుడు యేసుని పూజించెదము
|| సాగిలపడి ||

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా

“అతడు అతికాంక్షణీయుడు. ఇతడే నా ప్రియుడు. ఇతడే నా స్నేహితుడు.” పరమగీతము Song Of Songs 5:16

పల్లవి : శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా
కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో

1. పాపరహిత దేవకుమారా – శాపవాహకా
శాపవాహకా – నిత్య కోప రహితుడా
|| శరణం ||

2. పరిపూర్ణ దేవుడా – నరావతారుడా
నరావతారుడా – మా యేసు నాథుడా
|| శరణం ||

3. దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా
దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా
|| శరణం ||

4. నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా
సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా
|| శరణం ||

5. సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా
కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా
|| శరణం ||

6. రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా
వినయపూర్ణుడా – మముగాచు దేవుడా
|| శరణం ||

7. సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా
నిత్యదేవుడా – మా మంచి బోధకుడా
|| శరణం ||

8. సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా
సత్యదేవుడా – మా నిత్యజీవమా
|| శరణం ||

9. ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు
వల్లభుండవు హల్లెలూయ పాడెదం
|| శరణం ||

ఇదిగో నీ రాజు వచ్చుచుండె

“నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.” జెకర్యా Zechariah 9:9

పల్లవి : ఇదిగో నీ రాజు వచ్చుచుండె
సీయోను కుమారి సంతోషించు
యేరూషలేం కుమారి ఉల్లసించు

1. నీదు రాజు నీతితో – దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె
|| ఇదిగో ||

2. రక్షణ గలవాడుగా – అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలేం – వచ్చుచుండె
|| ఇదిగో ||

3. సాత్వీకుండు యీ భువిన్ – అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై – వచ్చుచుండె
|| ఇదిగో ||

4. దీనపరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె
|| ఇదిగో ||

5. ఇలను గాడిద నెక్కియే – బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె
|| ఇదిగో ||

6. దావీదు కుమారుడు – దేవుడు పాపులకు
జయ గీతములతో – వచ్చుచుండె
|| ఇదిగో ||

7. యేసుని ప్రేమించుచు – హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయా
|| ఇదిగో ||

ప్రియయేసు ప్రియయేసు

“నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు” పరమగీతము Song Of Songs 5:10

పల్లవి : ప్రియయేసు ప్రియయేసు
అతి ప్రియుడేసు పదివేలలో
ఆయనే నా దిక్కుగా కెవ్వరు?

1. ఇహమందు వేరేది పేరే లేదు
ఆయనే నా కొసగె ఆత్మానందం
నన్ను విమోచించి నా కొసగె విడుదల
ఆహా నా కందించె నిత్య ముక్తి
ǁ ప్రియయేసు ||

2. దైవపుత్రుండే నా ప్రియుడు యేసు
ప్రాయశ్చిత్తుడైన గొర్రెపిల్ల
యిహమున కరిగెను తన రక్తమిచ్చెను
కల్వరిపై ప్రాణమర్పించెను
|| ప్రియయేసు ||

3. సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్
విలువైన ప్రాణము అప్పగించెన్
నలుగ గొట్టబడి గాయముల నొంది
తిరిగి లేచెను నా ప్రియుడు యేసు
|| ప్రియయేసు ||