స్తుతించుడి స్తుతించుడి

“మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి.” కీర్తన Psalm 135:2

పల్లవి : స్తుతించుడి స్తుతించుడి
ఆయన మందిరపు ఆవరణములో
యెహోవా దేవుని స్తుతించుడి
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి

1. సర్వాధికారుడంచు – సర్వశక్తి మంతుడంచు
సంపూర్ణ ప్రేమరూపి – సాధుల శ్రీమంతుడంచు
సృష్టి నిన్ స్మరణ చేసెనో – ఓ … స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన – రాజా రాజా
తళతళ మెరిసెడు మెరుపులలోన – రాజా రాజా
చననము గలిగిన జీవులలోన – రాజా రాజా
పలుకులు లేని ప్రకృతిలోన – రాజా రాజా
రాజాధి రాజుల రాజా – ఓ … స్తుతించుడి
|| స్తుతించుడి ||

ఆద్యంతరహితుడవగు మా జ్యోతి

నిత్యుడగు తండ్రి” యెషయా Isaiah 9:6

1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి
మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము – మేదిని
నా దీన కాపరి నీతి కృపానిధి
శుధ్ధ దివ్యగత్రుడా

2. మనోహరమగు నీ కృప పొందను
మానవు లెల్లరము చేరితిమి – మానవు
ఆత్మరూపా కృపామయా నీ కరుణా
వరముల మాకీయుమా

3. పాలచే కడుగబడిన – ధవళాక్షుడా
వళ్లిపూలయందు తిరుగువాడా – వళ్లి
షాలేము రాజా షారోను రోజా
శాంత భూపతివి నీవే

4. లక్షల దూతల స్తుతుల నందువాడా
అక్షయ హేమమకుట ధారుడా – అక్షయ
హేమ కిరీటధారులమై స్వర్గంబు
చేర కడవరి వర్షమీ

5. క్రొత్త యెరూషలేం నగర రాజా
రత్నాల పునాది వేసితివి – రత్నాల
ధీరతతో నీ సాక్ష్యము చాటను
స్థిరమగునాత్మ నిమ్ము

6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
ఇష్టంపురూప లావణ్యవతీ – ఇష్ట
అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
పాత్రులుగా చేయుమా

నీ రెక్కల చాటున శరనొందెదన్

పల్లవి: నీ రెక్కల చాటున శరనొందెదన్ – నా విశ్రమ గృహమైన ప్రభువా
మొట్ట పెట్టెదను ఉత్సహించెదను – మిగిలిన జీవిత కాలమంతయును

1. అలసితిని నే నావిధేయతతో – కృంగితి నేను పాపమూ చేతన్,
లేపితివినన్నుహత్తుకొంటివి – నీవు మోహన కాడి – నాకు విశ్రాంతి

2. గువ్వను పోలి ఎగిరి పొదును – నెమ్మది నొందెదనని తాలచితిని,
లేదు లేదు విశ్రాంతేచ్చట – నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్

3. చేసితివి మాతో వాగ్దానమును – నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్,
మానెదము మా ప్రయాశమును – పొందెదము క్రీస్తులో తిరిగి నే చేరితిన్

4. సిలువపై శ్రమలొందితివి – కార్చితివి నీ రక్తము మాకై,
లేచితివి నీవు మరణము గెల్చి – కూర్చుతివి నీ సంశుముగా మమ్ము

5. భంగపరచితి నీ విశ్రాంతిని – యోకోబుపంటి నా నడవడితో,
మార్పు నొందితి బేతేలు నందు – ఇక విశ్రమించుము నాలో ప్రభువా

ద్వేషపు మాటలచే నా చుత్తుచేరి

పల్లవి : యెహోవా నా స్తుతి కాదారుడా – మౌనముండకుము – మౌనముండకుము దుష్టులు కపటులు – తమ నోరు తెరిచి -అబద్ధములతో – నా ఫై లీచిరి

1. ద్వేషపు మాటలచే నా చుత్తుచేరి -, నిర్నిమిత్తముగా పౌరదుచున్నారు 2,
ప్రేమకు ప్రీతిగా పగబూనిరి నా ఫై -, మానక నేను ప్రార్థించున్నాను 2

2. అపవాది వనికుడి – ప్రక్యబుబడునుగాక – ,
వాని ప్రార్థన – పాపమగును గాక,
వాని దినములు – కొద్దివగునుగాక – ,
ఆస్తియంతయుధోచు – కొనబడును గాక

3. విధపయై వాని భార్య దిగులొందునుగాక – ,
దేశాధిమ్యరులై – పిల్లలుందురు గాక,
తల్లిపాపము తుడుప – బడకుండునుగాక – ,
సంతతి యంతయు – నాశమగుగాక

4. పితరుల దోషములు – ఎన్న టెన్నటికిని – ,
జ్యపకముంచు కొనమో దేవా,
రాబోవు తరములలో వాణి పేరు – ,
మరుబవడి మాసిపోవునుగాక

5. కృపజూపుటయే మరచునవారై – ,
శ్రమగలవానిని – చంపెనాశించిరి,
నలిగిన హృదయుల – తరిమెడువానికి – ,
శాపమేగాని – ధీవెన యెట్టిది

6. ఫై వస్త్రమువలె – శాపమునందెనుగా – ,
నడికత్తువలె వాని – వదల కుండునుగాక,
నా శత్రువులకు – ఓ నా యేహోవా – ,
నీ ప్రతీకారము – ఇదియగుగాక

7. దివింతువు నన్ను – వారు శపింపగా – ,
నీ దాసుడానందింప సిగ్గగువారికి,
జనముల మధ్యను – నిను స్తుతియుంతును – ,
కృతఙయతలతో – ఓ నా ప్రభువా

సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు

“యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు.” కీర్తన Psalm 126

పల్లవి : సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు
మనము కలలను కనిన వారివలె నుంటిమిగా

1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు
అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె
|| సీయోనుకు ||

2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె
అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా
|| సీయోనుకు ||

3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు
మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి
|| సీయోనుకు ||

4. దక్షిణ దేశములో నదులు పారునట్లుగా
దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా
|| సీయోనుకు ||

5. పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు
పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు
|| సీయోనుకు ||

6. ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని
సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును
|| సీయోనుకు ||