ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

“తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” యోహాను John 15:13

పల్లవి : ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది

1. అగమ్య ఆనందమే – హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
|| ఓ యేసు ||

2. సంకట సమయములో – సాగలేకున్నాము
దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి
|| ఓ యేసు ||

3. మరణాంధ కారంపు లోయ నే సంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు
|| ఓ యేసు ||

4. కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తిపరచుచు – నాతో నుండు నేసు
|| ఓ యేసు ||

5. దేవుని గృహములో సదా స్తుతించెదను
నంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్
|| ఓ యేసు ||

ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

“కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము” కీర్తన Psalm 95:2

పల్లవి : ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము
1. మాదు హృదయ కానుకలను
సమర్పించుచున్నాము
|| ప్రభో ||

2. యేసు సుందర శీలము గల్గి
నీ సన్నిధి కేతెంచితిమి
|| ప్రభో ||

3. నీ దివ్య వాక్య బలముచే
నూతన జీవము నొందితిమి
|| ప్రభో ||

4. నీ వాక్యము నే చాటించుటకు
నొసగుము సోదర ప్రేమను
|| ప్రభో ||

సర్వశక్తుడు నాకు – సర్వమాయనే

“క్రీస్తే సర్వమును అందరిలో నున్నవాడై యున్నాడు” కొలస్సయులకు Colossians 3:11

1. సర్వశక్తుడు నాకు – సర్వమాయనే
సర్వమాయనే – నాకు సమస్తమాయనే

2. మార్గ సత్యజీవంబు – యేసునాథుడే
మార్గమాయనే – ఏకమార్గమాయనే

3. జీవాహారము జీవపానము నాయనే
జలము నాయనే – శాంతజల మాయనే

4. ఆదియంతము అల్ఫా ఓమేగాయనే
ఓమేగాయనే – ఏకసుతుడాయనే

5. రక్షణ పరిశుద్ధత నీతియాయనే
నీతియాయనే – దేవ నీతి యాయనే

6. పునరుత్థానము నిత్య జీవమాయనే
జీవమాయనే – నిత్య జీవమాయనే

7. హల్లెలూయకు సర్వపాత్రుడాయనే
పాత్రుడాయనే – ఆశ్రయ దుర్గమాయనే

యేసునాథా త్రిలోకనాథా

“నిత్యము ఆయన కోర్తి నా నోట నుండును” కీర్తన Psalm 34:1

1. యేసునాథా త్రిలోకనాథా – లోకోద్ధారక క్రీస్తు దేవా
చక్కగ దాసుల బ్రోచి రక్షించుము

2. అబ్దిమీద నడచిన దేవా – ఐదు రొట్టెల నైదువేలకు
నతిశయముగను పంచిన దేవా

3. కానా లోని వివాహ విందున – నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన
కరుణానిథీ నను ప్రేమించు నిత్యము

4. నాథా నాదు గతియు నీవే – పాదారవింద శరణమిమ్ము
ఆధారమీవే దీనోపకారా

5. కృపాసముద్ర దయామయుండా – తలను ముండ్ల మకుటధారివై
సిలువయందు మరణించితివి

6. నీదు రాజ్యము వచ్చునుగాక – సాధుగ మోక్షసౌఖ్యము చేర
నీదు దాసుల నాశీర్వదించుము

యెహోవాకు పాడుడి పాటన్

“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి” యెషయా Isaiah 12:5

పల్లవి : యెహోవాకు పాడుడి పాటన్
అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని
1. భూమియందంతట ప్రచురము చేయుడి
ఆటంకము లేక దీని ప్రకటించుడి
|| యెహోవాకు ||

2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
అతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు
|| యెహోవాకు ||

3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని
సీయోనులో క్రియలను వివరించెదము రండి
|| యెహోవాకు ||

4. శూన్య పట్టణములు నిండినందువలన
యెహోవా నేనేయని వారు గ్రహించెదరు
|| యెహోవాకు ||

5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
నింపెద మనుజులతో వారి పట్టణములను
|| యెహోవాకు ||

6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు
|| యెహోవాకు ||