వందనాలు వందనాలు

వందనాలు వందనాలు – వరాలు పంచే నీ గుణ సంపన్నతకు (2) నీ త్యాగ శీలతకు నీ వశమైతి నే – అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వందన|| 1. ఇహలోక ధననిధులన్నీ – శాశ్వతముకావని ఎరిగితిని (2) ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే – ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి ||వందన|| 2. యజమానుడా నీవైపు – దాసుడనై నా కన్నులెత్తగా (2) యాజక వస్త్రములతో ననుఅలంకరించి – నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే (2)  ||వందన|| 3. … Read more

ఆశ్రయదుర్గము నీవని

ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు – నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు – నాఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక … Read more