మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) దీన మనస్సు – దయ గల మాటలు సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2) జడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||
తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ లిరిక్స్
దేవా నా హృదయము – నీయందు స్థిరమాయెన్
“దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ఆత్మ పాడుచు గానముచేయును.” కీర్తన Psalm 108:1-5
పల్లవి : దేవా నా హృదయము – నీయందు స్థిరమాయెన్
నే పాడుచు స్తుతింతున్ – నా యాత్మ గానము చేయున్
1. స్వరమండలమా సితారా – మేల్కొనుడి మీరు కూడా
వేకువనే నే లేచెదను – స్తుతిగానము చేసెదను
|| దేవా ||
2. దేవా నీ జనముల మధ్య – కృతజ్ఞతా స్తుతులను
చెల్లించి ప్రజలలోన – స్తుతిగానము చేసెదను || దేవా ||
3. ఆకాశమున కంటె నీ – కృప మహోన్నతమైనది
నీదు సత్యము మేఘములకంటె – అత్యున్నతమైనది
|| దేవా ||
4. దేవా నీ వాకాశముకంటె – మహోన్నతుడవు కమ్ము
నీదు మహిమ సర్వభూమి – మీద వ్యాపించును గాక
|| దేవా ||
వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
“జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.” కీర్తన Psalm 107:32-43
పల్లవి : వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక
1. దేశనివాసుల చెడుగును బట్టి – నదుల నడవిగ జేసెను
నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను
|| వారాయనను ||
2. అడవిని నీటిమడుగుగా – మార్చివేసె నెహోవా
ఎండిన నేలను నీటి – ఊటగాను మార్చెను
|| వారాయనను ||
3.పురములు నివాసమునకై – వారేర్పరచుకొనునట్లు
పొలములలో విత్తనములు చల్లి – ద్రాక్షాతోటలు నాటిరి
|| వారాయనను ||
4. సస్య ఫల సమృద్ధి పొందు – నట్లు వాటివలన
ఆయన ఆకలిగొనిన వారిని – అచ్చట కాపురముంచెను
|| వారాయనను ||
5. మరియు ఆయన వాని నధికము – గా నాశీర్వదించగా
వారి సంతానాభివృద్ధి – అధికముగా వర్ధిల్లెను
|| వారాయనను ||
6. వారు విచార బాధ వలన – తగ్గిపోయినపుడు
రాజులను తృణీకరించి – ఎడారిలో తిరుగజేసె
|| వారాయనను ||
7. అట్టి దరిద్రుల బాధను బాపి – వారిని లేవనెత్తెను
అట్టివారి వంశము మంద – వలె వృద్ధిచేసెను
|| వారాయనను ||
8. యధార్థవంతులు దాని – చూచి సంతోషింతురు
మోసము చేయువారందరు – మౌనముగా నుందురు
|| వారాయనను ||
9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును
యెహోవ కృపాతిశయముల – దలంచెదరు గాక
|| వారాయనను ||
స్తుతియించు ప్రభున్ స్తుతియించు
“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.” కీర్తన Psalm 103
పల్లవి : స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు
నా ప్రాణమా నా సమస్తమా
1. ఆయన చేసిన ఉపకారములలో
నా ప్రాణమా నీవు మరువకుమా – దేనిన్ – నా
నీ దేవుని నీవు మరువకుమా
|| స్తుతియించు ||
2. నీ దోషములను మన్నించి వేసి
నీ రోగముల నన్నింటిని – ప్రభు – నీ
కుదుర్చి వేయుచున్నాడు
|| స్తుతియించు ||
3. నా ప్రాణమును సమాధి నుండి
విమోచించిన వాడని – ప్రభు – విమో
కరుణా కిరీటము నియ్యన్
|| స్తుతియించు ||
4. పక్షిరాజు యౌవనము వలె
నూతన యౌవన ముండునట్లు – నీకు – నూతన
మేలుతో తృప్తిపరచును
|| స్తుతియించు ||
5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు
యెల్లప్పుడు వ్యాజ్యమాడడు – నీతో – ఎల్లప్పుడు
ప్రతీకారము చేయడు
|| స్తుతియించు ||
6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో
భక్తుల యెడల కృపనంత – తన – భక్తుల
అధికముగా చేసియున్నాడు
|| స్తుతియించు ||
7. పడమటికి తూర్పెంత యెడమో
పాపములకును మనకంత – మన – పాప
యెడము గలుగ జేసెను
|| స్తుతియించు ||
8. తండ్రి తన కుమారుని యెడల
జాలిపడునట్లు యెహోవా – బహు – జాలి
భక్తులపై జాలిపడును
|| స్తుతియించు ||
9. మంటివాడవని ఆయన యెరుగున్
నిర్మింపబడిన విధమెరుగున్ – నీవు – నిర్మి
నీ దేవుడు నిన్ను నెరుగును
|| స్తుతియించు ||
10. దేవదూతలారా దైవభక్తులారా
యెహోవా మహాసైన్యములారా – ఓ – యెహోవా
హల్లెలూయ పాట పాడుడి
|| స్తుతియించు ||
సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి
“సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.” కీర్తన Psalm 100:1-2
పల్లవి : సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు
1. తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప
బలియాయెన్ – శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు – విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
3. మోషేకు తన సేవను నొసగె – యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
4. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా – కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
5. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము – నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||