నా జీవితాన కురిసెనే
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం ||2|| నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ||2|| 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2|| కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను ||2|| || నా జీవితాన || 2. నా యేసయ్యా – నీ నామమెంతో ఘనమైనది – కొనియాడదగినది ||2|| కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది ||2|| || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు ||2|| కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను ||2|| || నా జీవితాన ||