భూమ్యాకాశములు సృజించిన

భూమ్యాకాశములు సృజించినయేసయ్యా నీకే స్తోత్రం (2)నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్నుదీన దశలో నేనుండగా నను విడువవైతివి (2)       ॥భూమ్యాకాశములు॥ జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్నుఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2)       ॥భూమ్యాకాశములు॥ భుజంగములను అణచివేసి కాచినావు నన్నుఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2)       ॥భూమ్యాకాశములు॥ నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివినిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2)       ॥భూమ్యాకాశములు॥