శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2|| యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత|| 1.సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు ||2|| నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2|| నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత|| 2.నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2|| శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత||

స్తుతి గానమే పాడనా

స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా (2)నా ఆధారమైయున్నయేసయ్యా నీకు – కృతజ్ఞుడనైజీవితమంతయు సాక్షినై యుందును (2)       ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులుమేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)నీ ధర్మాసనము – నా హృదయములోస్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)       ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములులౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)నీ శ్రేష్టమైన – పరిచర్యలకైకృపావరములతో నను – అలంకరించితివే (2)       ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గమువిశాల మార్గము కంటే – … Read more