త్రియేక దేవుడైన

త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండును 1. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసేనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. || త్రియేక || 2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే మేఘ మధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. || త్రియేక || 3. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగిపొర్లేనే జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే  || త్రియేక ||

సాగిపోదును

సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును – ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును || నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును – నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును || శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును – మరి దేవుని … Read more