నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2|| నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2||     || నిత్యా || 2. నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే ||2|| మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య ||2||    || నిత్యా ||

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || చేనిలోని పైరు చేతికిరాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరిసంపదలన్నీ దూరమైపోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే – ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే … Read more