నేను యేసును చూచే సమయం

నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం  అక్షయ శరీరముతో – ఆకాశ గగనమున ఆనందభరితనై – ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను || రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును || నేను || అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను ||

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె … Read more