స్తుతించుడి యెహోవా దేవుని

“యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాని నతిక్రమింపదు.” కీర్తన Psalm 148

పల్లవి : స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి

1.కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||

స్తుతియించుడాయన నాకాశవాసులారా

“యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతియించుదురు గాక! ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.” కీర్తన Psalm 148

1.స్తుతియించుడాయన నాకాశవాసులారా
స్తుతియించుడి ఉన్నతస్థలములలో

పల్లవి : స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి

2. స్తుతియించుడి దూతలారా మీరందరు
స్తుతియించుడాయనన్ సైన్యములారా
|| స్తుతియించుడి ||

3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు
కాంతిగల నక్షత్రములారా
|| స్తుతియించుడి ||

4. స్తుతియించుడి పరమాకాశములారా
స్తుతియించుడి ఆకాశ జలములారా
|| స్తుతియించుడి ||

5. స్తుతియించుడి సమస్త మకరములారా
స్తుతియించుడి అగాధ జలములారా
|| స్తుతియించుడి ||

6. స్తుతియించుడగ్నియు వడగండ్లార
స్తుతియించుడాయన నావిరి హిమమా
|| స్తుతియించుడి ||

7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను
స్తుతియించుడి పర్వతములు గుట్టలారా
|| స్తుతియించుడి ||

8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా
స్తుతియించుడి దేవదారు వృక్షములారా
|| స్తుతియించుడి ||

9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా
స్తుతియించుడి మీరు సాధు జంతువులారా
|| స్తుతియించుడి ||

10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా
స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా
|| స్తుతియించుడి ||

11. స్తుతియించుడాయనన్ భూరాజులారా
స్తుతియించుడి సమస్త జనంబులారా
|| స్తుతియించుడి ||