యెహోవా అగాధ స్థలములలో నుండి

“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” కీర్తన Psalm 130

పల్లవి : యెహోవా అగాధ స్థలములలో నుండి – నీకు మొర పెట్టుచున్నాను
ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము

1. యెహోవా నీవు దోషములు – కనిపెట్టి చూచిన యెడల
ప్రభువా ఎవడు నిలువగలడు?
|| యెహోవా ||

2. అయినను జనులు నీ యందు – భయభక్తులు నిలుపునట్లు
నీ యొద్ద కృప దొరుకును
|| యెహోవా ||

3. యెహోవా కొరకు నేను – కనిపెట్టుకొనుచున్నాను
ఆశ పెట్టుకొనుచున్నాను
|| యెహోవా ||

4. కావలి వారు ఉదయము కొరకు – కనిపెట్టుకొనుట కంటె
నా ప్రాణము కనిపెట్టుచున్నది
|| యెహోవా ||

5. ఇశ్రాయేలు యెహోవా – మీద ఆశపెట్టుకో
యెహోవా యొద్ద కృప దొరుకున్
|| యెహోవా ||

6. ఇశ్రాయేలు దోషము నుండి – ఆయనే విమోచించును
విమోచన దొరుకును
|| యెహోవా ||

యెహోవా ఇల్లు కట్టించని యెడల

“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.” కీర్తన Psalm 127,128

పల్లవి : యెహోవా ఇల్లు కట్టించని యెడల
దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే
యెహోవా పట్టణమును కాపాడనియెడల
దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే

1. మీరు వేకువనే లేచి రాత్రియైన
తర్వాత పండు కొనుచు మీరు – తర్వాత
ఆర్జితమైన ఆహారమును
మీరు తినుచుండుట వ్యర్థమే – మీరు
|| యెహోవా ||

2. తన ప్రియులు నిద్రించుచుండగా
తానే యిచ్చు చున్నాడు వారికి – తానే
తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము
కనెడి గర్భఫలము బహుమానమే – కనెడి
|| యెహోవా ||

3. యౌవన కాలమున పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణములు – బలవంతుని
తన అంబుల పొదిని నింపుకొనువాడు
ధన్యుడు అట్టివాడు బహుగా ధన్యుడు
|| యెహోవా ||

4. యెహోవా యందు భయభక్తులు కలిగి
నడచు వారందరు ధన్యులు – నడచు
మహా మేలు నీకు కలుగును
నిశ్చయముగా నీవు ధన్యుడవు
|| యెహోవా ||

5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య
ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు – ఫలించు
భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె నుందురు
|| యెహోవా ||

6. యెహోవా యందు భయభక్తి గలవాడు
ఆశీర్వదింపబడును నిజముగా – ఆశీర్వ
యెహోవా నిన్ను సీయోను నుండి
ఆశీర్వదించును బహుగా
|| యెహోవా ||

7. నీ జీవితమంతా యెరూషలేముకు
క్షేమము కలుగుటయే జూతువు – క్షేమము
నీ పిల్లల పిల్లలను చూతువు నీవు
ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును
|| యెహోవా ||