యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ

1. యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ
నీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము

2. నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆ
నా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది

3. నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను – ఆ
పాపముచే నా యెముకలలో – స్వస్థత లేదు

4. నా దోషములు నా తలమీద – పొర్లిపోయినవి – ఆ
నాపై మోయలేని బరువు – వలె నున్నవి

5. మనోవేదన బట్టి కేకలు – వేయుచున్నాను – ఆ
కనబడుచున్నది నీకు నా యభి – లాషయంతయు

6. నా నిట్టూర్పులు నీకు దాచ – బడియుండలేదు – ఆ
నా గుండె కొట్టుకొని బలము – విడచిపోయెను

7. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను – ఆ
నా పాపమును గూర్చి విచారపడుచున్నాను

8. నా శత్రువులు చురుకై బలము – కలిగిన వారు – ఆ
నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

9. మేలుకు ప్రతిగా వారు – కీడు – చేయుచున్నారు – ఆ
మేలు చేసినందుకు వారు – విరోధులైరి

10. దేవా నాకు దూరముగా – నుండకుము ప్రభో – ఆ
రక్షకా నా సహాయమునకు – వేగమే రమ్ము

వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు

పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు
మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి

1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు
పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు
|| వ్యసనపడకుము ||

2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము
దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు
|| వ్యసనపడకుము ||

3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము
ఆయనను నమ్ముకొనుము నీదు – కార్యము నెరవేర్చును … నీవు
||వ్యసనపడకుము ||

4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
వ్యసనపడకుము నీ కది – కీడు కే కారణము … నీవు
|| వ్యసనపడకుము ||

5. ఒకని నడత యెహోవాయే – స్థిరము చేయును
ఆయన వాని ప్రవర్తనను జూచి – ఆనందించును – ఆ … నీవు
||వ్యసనపడకుము||

6. యెహోవా అతని చేతిని – పట్టి యుండెను
అతడు నేలను పడినను లేవ – లేక యుండడు – ఆ … నీవు
|| వ్యసనపడకుము ||

7. నీతిమంతులు విడువబడుటగాని – వారి సంతానము
భిక్షమెత్తుటగాని – నేను చూచి యుండలేదు – ఆ … నీవు
|| వ్యసనపడకుము ||