యెహోవా నా దేవా

దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము
కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము

పల్లవి : యెహోవా నా దేవా

1. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
|| యెహోవా నా దేవా ||

2. నీకు విరోధముగానే – పాపము చేసియున్నాను
నీ దృష్టి యెడల చెడు – తనము నే చేసియున్నాను
|| యెహోవా నా దేవా ||

3. ఆజ్ఞ యిచ్చునపుడు – నీతిమంతుడవుగను
తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు
|| యెహోవా నా దేవా ||

4. పాపములోనే పుట్టిన – వాడను పాపములోనే
నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
|| యెహోవా నా దేవా ||

5. నీ వంతరంగమున – సత్యము కోరుచున్నావు
ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు
|| యెహోవా నా దేవా ||

6. హిస్సోపుతో శుద్ధీకరించు – పవిత్రుడనగుదును
హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
|| యెహోవా నా దేవా ||

7. ఉత్సాహ సంతోషములు – నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన – యెముకలు హర్షించును
|| యెహోవా నా దేవా ||

సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

పల్లవి : సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి
దరిద్రులు ధనికులేమి – సర్వజనులారా వినుడి
|| సర్వజనులారా ||

2. నా హృదయ ధ్యానము పూర్ణ – వివేకమును గూర్చినది
నే పల్కెద జ్ఞానాంశముల – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

3. గూడార్థాంశము వినెద – చేతబట్టి సితార
మర్మము దెల్పెద నేను – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

4. నాకై పొంచిన దోషుల – క్రియలు నన్ను చుట్టన్
ఆపదలో భయపడనేల – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

5. తమ ధన సంపదనుబట్టి – పొగడుకొనెడు వారికి
నేనేల భయపడవలెను – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు
సోదరుని రక్షించలేడు – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

7. వాని నిమిత్తము దైవ – సన్నిధి ప్రాయశ్చిత్తము
చేయువాడెవ్వడు లేడు – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

8. ప్రాణ విమోచన ధనము – బహు గొప్ప దెన్నటికిని
తీరక యుండవలసినదే – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

మన దేవుని పట్టణమందాయన

పల్లవి : మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు

1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము
ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది
|| మన దేవుని ||

2. దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి
|| మన దేవుని ||

3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ – వేదన పట్టెను
తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల – పగులగొట్టుచున్నావు
|| మన దేవుని ||

4. సైన్యము లధిపతి యెహోవా దేవుని – పట్టణమునందు
మనము వినినట్టి రీతిగా జరుగుట – మనము చూచితిమి
|| మన దేవుని ||

5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర – పరచియున్నాడు
దేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి
|| మన దేవుని ||

6. దేవా నీ నామము ఎంత గొప్పదో – నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత – గొప్పదై యున్నది
|| మన దేవుని ||

7. ఈ దేవుడు సదాకాలము మనకు – దేవుడై యున్నాడు
మనల నడిపించును మరణపర్యంతము – హల్లెలూయా ఆమెన్
|| మన దేవుని ||

సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి

1. సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి
జయార్భాటము యెహోవాను గూర్చి చేయుడి

2. యెహోవా మహోన్నతమైన భయంకరుడు
మహారాజై యున్నాడు సకల జగమునకు

3. జనముల నెహోవా మనకు లోపర్చును
జనుల మన కాళ్ళ క్రింద అణగ ద్రొక్కును

4. తన ప్రియ యాకోబుకు మహాతిశయముగ
మనకు స్వాస్థ్యమును ఏర్పాటు చేసెను

5. దేవుడార్భాటముతో నారోహణమాయెను
బూరధ్వనితో యెహోవారోహణమాయెను

6. మన దేవుని కీర్తించుడి కీర్తించుడి
మన రాజును కీర్తించుడి కీర్తించుడి

7. రాజై యున్నాడు యెహోవా యీ సర్వభూమికి
రమ్యముగా సంకీర్తనలు మీరు పాడుడి

8. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు
పరిశుద్ధ సింహాసనాసీనుడై యున్నాడు

9. జనుల ప్రధాను లబ్రాహాము దేవునికి
జనులై యేకముగా కూడుకొనియున్నారు

10. మహోన్నతుడు ఆయెను యెహోవా దేవుడు
మనము వేసికొను కేడెములు తనవి

దేవుడే మనకాశ్రయమును

పల్లవి : దేవుడే మనకాశ్రయమును
దుర్గమునై యున్నాడు – ఆపదలో

అనుపల్లవి : కావున భూమి – మార్పు నొందినను
కొండలు మున్గినను – ఆపదలో ఆపదలో

1. సముద్ర జలములు – ఘోషంచుచు – నురుగు కట్టినను
ఆ పొంగుకు పర్వతములు కదలినను – మనము – భయపడము
|| దేవుడే ||

2. ఒక నది కలదు – దాని కాలువలు – దేవుని పట్టణమును
సర్వోన్నతుని – మందిర పరిశుద్ధ స్థలమును – సంతోషపర్చు చున్నవి
|| దేవుడే ||

3. దేవుడా పట్టణములో – నున్నాడు దానికి – చలనము లేదు
అరుణో – దయమున దానికి సహాయము చేయుచున్నాడు
|| దేవుడే ||

4. జనములు ఘోషించు – చున్నవి రాజ్యములు కదలు చున్నవి
ఆయన కంఠధ్వని వినిపించగా – భూమి కరిగి పోవుచున్నది
|| దేవుడే ||

5. సైన్యములధిపతి – యెహోవా మనకు తోడైయున్నాడు
యాకోబు దేవుడు – మనకు ఆశ్రయమునై యున్నాడు
|| దేవుడే ||

6. యెహోవా చేసిన – కార్యములను వచ్చి చూడండి
అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే
|| దేవుడే ||

7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను
|| దేవుడే ||