Sudhaa Madhura Kiranaala Arunodayam

సుధా మధుర కిరణాల అరుణోదయం

కరుణామయుని శరణం అరుణోదయం (2)

తెర మరుగు హృదయాలు వెలుగైనవి

మరణాల చెరసాల మరుగైనది (2)

1. దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)

నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)

ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది

పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)

నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)

2. లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)

క్షమ హృదయ సహనాలు సహపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)

నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే

నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)

ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)

Silent Night Holy

1. శుద్ధరాత్రి! సద్ధణంగ
నందఱు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ
బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
దివ్య నిద్ర పొమ్మా
దివ్య నిద్ర పొమ్మా.

2. శుద్ధరాత్రి! సద్దణంగ
దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకుఁ దెలిపెను
ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను.
క్రీస్తు జన్మించెను.

3. శుద్ధరాత్రి! సద్దణంగ
దేవుని కొమరుఁడ!
నీ ముఖంబున బ్రేమ లొల్కు
నేఁడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే
నీవు పుట్టుటచే.

sri yesundu janminche reyilo

శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో
||శ్రీ యేసుండు||

1. కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున
||శ్రీ యేసుండు||

2. సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం
డాయెనందున ||శ్రీ యేసుండు||

3. పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి
||శ్రీ యేసుండు||

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ
యేసుండు||

5. మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను
||శ్రీ యేసుండు||

6. పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను
||శ్రీ యేసుండు||

7. అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ
యేసుండు||

Vākyamē śarīra dhāriyai vasin̄cenu

వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)
కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||
ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ (2)
నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే||
పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ (2)
కరము చాచి – కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||

వింతైన తారక వెలిసింది గగనాన

వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

1.ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||

2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||