అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని

అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని ”2”
ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2”

1. బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడని
అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని “2” “ఒక వార్త”

2. అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2”“ఒక వార్త”

అత్యంత రమణీయ అమరపురము వీడి

అత్యంత రమణీయ అమరపురము వీడి
అవనికి అరుదించితివా దేవా (2)
అల్పులైన్న మాపై నీ ప్రేమ నిలుపా (2)
సంకల్పించితివా తండ్రి బ్రోవా (2) (అత్యంత)

1. ఆదాము పాపము హరియింపగా
నిర్మల గర్భము సృజియితివా
రక్షణ కాలము అరుదించగా
కన్యకు శిశువుగా జన్మించితివా
భక్తుల మోకులు నేరవేర్చగా
బేత్లహేములో ఉదయించినవ (2)
ఘనత మహిమ స్తుతులుఅనుచు
దూతగానములు కీర్తనలు పాడగా (2)
( అత్యంత రమణీయ)

2. చీకటిలో చిరుద్వీపం విలిగించగా
వేదనలో ఉపశమనం కలిగించగా
సాతాను దాస్యము తొలగించగా
శాంతి సందేశము వినిపించగా
ధరపైన ప్రభురాజ్యం స్థాపించనించి
నరరూపదరుడవై జేనియించినవా(2)
రాజులరరాజు ప్రభవించినడాఅనుచు

గొల్లలు జ్ఞానులు దర్శించరగా(అత్యంత రమణీయ)

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
సీకటంత పారిపాయెరా  //2//
మా సిక్కులన్ని తీరిపాయెరా 
మా దిక్కుమొక్కు యేసుడాయెరా  //2//
సంబరాలు ఈయాల సంబరాలు
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//

1. గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక
మందలను కాయుచుండగా -చలి మంటలను కాయుచుండగా //2//
ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2// 
ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే…..
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర  //2//అకసాన//     

2. సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపింది
జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
ఆ దూతలంతా గానాలు చేశారు…..
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా
//2//అకసాన//

అంబరవీధిలో వింతైన తారక

అంబరవీధిలో వింతైన తారక /2/
సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/
అంబరవీధిలో వింతైన తారక
Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/

1.దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగా
కారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/
సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ
సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/
Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/

2.దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగా
గొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/
జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా
క్రీస్తుయేసుని జననంతో భువియే పులకరించగా /2/

అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా

అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా

1. జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించి
శిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి

2. అంధకారమును తొలగించి – హృదయపు దీపము వెలిగించి
వాక్యమే ఇల నిజతారకలా –