ఆకాశగగనాన మెరిసింది తారక

ఆకాశగగనాన మెరిసింది తారక
యేసయ్య ఉదయించాడనీ ” 2 “
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు ” 2 “
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్ ” 2 “
*” ఆకాశగగనాన “*

*1 )* బెత్లహేము నగరాన
కన్య మరియ గర్భాన
పశులపాకలో పవలించాడు యేసయ్య ” 2 “
వేలాది దూతల గాణప్రతి గాణములతో
కోట్లాది దూతల సైన్య సమూహముతో ” 2 “
నాకోసమే భువికేతెంచెను
నజరేతు వానిగా ” 2 “
*” ఆకాశగగనాన “*

*2 )* గాబ్రియేలు దేవ దూత
తెలిపెను ఒక శుభవార్త
సర్వ మానవాళికి సంతోషము కలుగునని “2”
రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో
మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము ” 2 “
మన కోసమే భువికేతెంచెను నజరేతు వానిగా
*” ఆకాశగగనాన “*

ఆకాశంలోనా పండుగ వార్త

పల్లవి: ఆకాశంలోనా పండుగ వార్త
దూతాలి తెచ్చేను రక్షణ వార్త (2)
దైవ కుమారుడులోక రక్షకుడు
పసులపాకలో పవళించిన వార్త(2)
పండుగే పండుగే – జగమంతా పండుగే (హే)
పండుగే పండుగే – లోకమంతా పండుగే (2)
గొప్ప పేదా లేదు – చిన్న పెద్ద లేదు
రాష్ట్రము దేశం లేదు – లోకమంతా పండుగే (2) || ఆకాశంలోనా ||

1.పొలములోన గొర్రె మందలు – కాయుచుండగా
వచ్చి గాబ్రియేలు పలికే – తెల్ల మహిమతో (2)
అంతటా కాపరులు – బయలు వెళ్లిరి
పరుగు పరుగున- యేసుని చూచిరి (2)
హే ఆకాశంలో- పండుగ వార్త
దైవ కుమారుని – జనన వార్త (2)
పల్లె పల్లెలోన – ఊరు వాడల్లోన
వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2)
|| ఆకాశంలోనా ||

2.తారను చూచి – తూర్పు జ్ఞానులు
యేసుని ఆరాధింప – గోరి (చూడ) వెళ్లిరి (2)
యేసుని చూచి – కానుకల ఇచ్చి
ఆరాధించి – తిరిగి వచ్చిరి (2)
హే ఆకాశంలో- పండుగ వార్త
దైవ కుమారుని – జనన వార్త (2)
పల్లె పల్లెలోన – ఊరు వాడల్లోన
వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2)
|| ఆకాశంలోనా ||

3.మొదటిసారి దీనునిగా – పసుల పాకలో పవళించెను
రెండవ సారి కొదమ సింహమై – మేఘారూఢుడై ( రాజులకు రాజుగా) రానైయుండే (2)(హే)
పండుగే పండుగే – జగమంతా పండుగే (హే)
పండుగే పండుగే – లోకమంతా పండుగే (2)
గొప్ప పేదా లేదు – చిన్న పెద్ద లేదు
రాష్ట్రము దేశం లేదు – లోకమంతా పండుగే (2) || ఆకాశంలోనా |