ఆకాశంలో చూడు ఒక వింత తారక

ఆకాశంలో చూడు ఒక వింత తారక
వెలుగులు చిమ్మెను క్రీస్తు జన్మచాటగా “2”
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
ఆయన కిష్టులైన వారందరికి భూవిపైన సమాదానము
Happy happy happy Christmas – merry merry merry Christmas “2”

1. పరిశుద్ద ఆత్మవలన – కన్య మరియ గర్బమందున
లోక పాపాలు మోయు దేవుని గొర్రెపిల్లగా
జన్మించెను ధర పులకించగా – సర్వలోకము పరవశించగా “2”

2. గాబ్రియేలు ధూత తెల్పెను – యేసు వార్త గొల్లలకు
తార తెలిపే మార్గమున – తూర్పు దేశ జ్ఞానులకు
బంగారు సాంబ్రాణి బొళమును కానుక లర్పించిరి
పండితులు పామరులు ఎవ్వరికైనా యెసే నిజమైన దేవుడు “2”

ఆకాశం వెలిగింది రాత్రి వేళలో

ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం (2)
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని (2)

1) పరలోక నాధుండు – లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు – మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్ నరరూప దాల్చాడు(2)(ఆకాశం)

2) పొలమందు కాపరులు రాత్రివేళయందు
చలియందు తమ మందను కాపుకాయుచు నుండగ
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు (2)(ఆకాశం)

3) చూచారు ఘగనానా – ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట
బెత్లెహేము గ్రామమున్ (2)
గాచారు ప్రభురాజున్ మ్రొక్కికాంతులతో (2) (ఆకాశం)