చలి రాతిరి ఎదురు చూసే

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2)
పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||
చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||

చింత లేదిక యేసు పుట్టెను

పల్లవి:
చింత లేదిక యేసు పుట్టెను – వింతగను బెత్లెహేమందున

చెంతజేరను రండి సర్వజనంగమా – సంతస మొందుమా
…చింత…

1.
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా

ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతు లొనరించిరి
…చింత…

2.
చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని

చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి
…చింత…

3.
కన్య గర్భమునందు బుట్టెను – కరుణ గల రక్షకుడు క్రీస్తుడు

ధన్యులగుటకు రండి వేగమే దీనులై – సర్వమాన్యులై
…చింత…

4.
పాప మెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను

దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము – మోక్షభాగ్యము