కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము

కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువార్తమానము
రాజు పన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము

తరములు యుగములు ఘనముగ
పలికిన క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికళలొసగిన
రారాజు ఆత్మకథ

1. కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట
అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట
పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట
కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము

వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ

2. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట
సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట
గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట
ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము

వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ

ఓ సద్భక్తులారా లోక రక్షకుండు

Reference: శిశివును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి మత్తయి Matthew 2:11

1. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్
రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకుబుట్టి నేడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీ యేసు
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

3. ఓ దూతలారా యుత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండ నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

4. యేసు ధ్యానించి నీ పవిత్రజన్మ
మీ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్యమాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”