కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే
ఆహా ఆనందమే – హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే…
ఆహా ఆనందమే – మెర్రి మెర్రి క్రిస్మస్
1. జ్ఞానులు సాగిలపడిరి – మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు – పూజించెదం ప్రభు యేసును
సర్వోన్నతమైన స్థలములలోన – దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి – భూమి మీద సమాధానము
2. గొల్లలు దేవుని మాటను – గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము – గ్రహియించుము దేవుని చిత్తము
వాక్యమైన దేవుడు శరీరధారిగా – మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము – యేసు క్రీస్తే లోకరక్షకుడు
kalam sampoornamainapudu – yesayya bhuvikocchenu
thaane manalanu preminchi rakshakudai janminchenu
rajadhi rajainanu – ilalo daasuniga jeevinchenu
sathyamunu sthaapinchutaku daiva suthuniga udayinchenu
idi asharyame – idi adbhuthame – aha anandame – happy happy christmas
1. gnaanulu saagilapadiri – mrokkiri prabhuvula prabhuvunu
atuvale viswasunchuchu – poojinchedham prabhu yesunu
sarvonnathamaina sthalamulalona – deva devunike mahima
thanakishtulaina prajalandariki – bhoomi meeda samadhaanamu
2. gollalu devuni matanu – grahiyinchiri dhootha cheppaga
vidheyathe manaku mukhyamu – grahiyinchumu devuni chitthamu
vakyamaina devudu sharreradhariga – mana madhyalo nivasinchenu
nammi viswasinchumu kalugu nithya jeevamu – yesu kreesthe loka rakshakudu