రా రండి జనులారా

హుక్ – నా నా నా నా నా….

1- రా రండి జనులారా
మనం బేతలెం పోదామా
యుద్ధుల రాజు జన్మించినాడు
వే వేగ వెల్లుధామా
జన్మ తరియింప తారలుధామా

సర్వోన్నత స్థలములలో నా
దేవునికి మహిమా ఆమెన్ ఆమెన్
ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లప్పుడు

2- పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్
యేసు మనల ప్రేమిస్తు పుట్టాడండోయ్
మన పాపము కోరకు పుట్టాడండోయ్
యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకొ

3- పాడుడి గీతములు హల్లెలుయ
మీటుడి నాధములు హల్లెలుయా
పాప రహితుడు హల్లెలుయ
పాప వినాశకుడు హల్లెలుయ

ఆకాశమున వింత గొలిపెను
అద్బుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు

4- రాజులకు రాజు యేసయ్య
పశువుల పాకలో పుట్టాడయ్య రాజులకు రాజు యేసయ్య
నీ కొరకు నా కొరకు పుట్టాడయ్య

గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా
దూతలు పాటలు పాడిరయ్యా (2)
ఈ వార్తను చాటింప పొదామయ్య (2)

పోదాము ఆహా పోదాము.
పద పోదాము మనము పోదాము

5-పోదాము పోదాము పయనమౌదాము శుభవార్త చెప్పా పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?శుభ వార్త చదివి చెప్ప సాగిపోదాము (2)

6- శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట
రాజులందరికయ్యో ఒక్కడే రాజు అట

పద రా హే పదా రే హే పద రా పోధాము
రన్న
శ్రీ యేసుని చూడా పద రా పోధాము
రానా

కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము

కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువార్తమానము
రాజు పన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము

తరములు యుగములు ఘనముగ
పలికిన క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికళలొసగిన
రారాజు ఆత్మకథ

1. కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట
అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట
పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట
కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము

వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ

2. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట
సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట
గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట
ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము

వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ