వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక

“జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.” కీర్తన Psalm 107:32-43

పల్లవి : వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక

1. దేశనివాసుల చెడుగును బట్టి – నదుల నడవిగ జేసెను
నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను
|| వారాయనను ||

2. అడవిని నీటిమడుగుగా – మార్చివేసె నెహోవా
ఎండిన నేలను నీటి – ఊటగాను మార్చెను
|| వారాయనను ||

3.పురములు నివాసమునకై – వారేర్పరచుకొనునట్లు
పొలములలో విత్తనములు చల్లి – ద్రాక్షాతోటలు నాటిరి
|| వారాయనను ||

4. సస్య ఫల సమృద్ధి పొందు – నట్లు వాటివలన
ఆయన ఆకలిగొనిన వారిని – అచ్చట కాపురముంచెను
|| వారాయనను ||

5. మరియు ఆయన వాని నధికము – గా నాశీర్వదించగా
వారి సంతానాభివృద్ధి – అధికముగా వర్ధిల్లెను
|| వారాయనను ||

6. వారు విచార బాధ వలన – తగ్గిపోయినపుడు
రాజులను తృణీకరించి – ఎడారిలో తిరుగజేసె
|| వారాయనను ||

7. అట్టి దరిద్రుల బాధను బాపి – వారిని లేవనెత్తెను
అట్టివారి వంశము మంద – వలె వృద్ధిచేసెను
|| వారాయనను ||

8. యధార్థవంతులు దాని – చూచి సంతోషింతురు
మోసము చేయువారందరు – మౌనముగా నుందురు
|| వారాయనను ||

9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును
యెహోవ కృపాతిశయముల – దలంచెదరు గాక
|| వారాయనను ||

స్తుతియించు ప్రభున్ స్తుతియించు

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.” కీర్తన Psalm 103

పల్లవి : స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు
నా ప్రాణమా నా సమస్తమా

1. ఆయన చేసిన ఉపకారములలో
నా ప్రాణమా నీవు మరువకుమా – దేనిన్ – నా
నీ దేవుని నీవు మరువకుమా
|| స్తుతియించు ||

2. నీ దోషములను మన్నించి వేసి
నీ రోగముల నన్నింటిని – ప్రభు – నీ
కుదుర్చి వేయుచున్నాడు
|| స్తుతియించు ||

3. నా ప్రాణమును సమాధి నుండి
విమోచించిన వాడని – ప్రభు – విమో
కరుణా కిరీటము నియ్యన్
|| స్తుతియించు ||

4. పక్షిరాజు యౌవనము వలె
నూతన యౌవన ముండునట్లు – నీకు – నూతన
మేలుతో తృప్తిపరచును
|| స్తుతియించు ||

5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు
యెల్లప్పుడు వ్యాజ్యమాడడు – నీతో – ఎల్లప్పుడు
ప్రతీకారము చేయడు
|| స్తుతియించు ||

6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో
భక్తుల యెడల కృపనంత – తన – భక్తుల
అధికముగా చేసియున్నాడు
|| స్తుతియించు ||

7. పడమటికి తూర్పెంత యెడమో
పాపములకును మనకంత – మన – పాప
యెడము గలుగ జేసెను
|| స్తుతియించు ||

8. తండ్రి తన కుమారుని యెడల
జాలిపడునట్లు యెహోవా – బహు – జాలి
భక్తులపై జాలిపడును
|| స్తుతియించు ||

9. మంటివాడవని ఆయన యెరుగున్
నిర్మింపబడిన విధమెరుగున్ – నీవు – నిర్మి
నీ దేవుడు నిన్ను నెరుగును
|| స్తుతియించు ||

10. దేవదూతలారా దైవభక్తులారా
యెహోవా మహాసైన్యములారా – ఓ – యెహోవా
హల్లెలూయ పాట పాడుడి
|| స్తుతియించు ||