పొందితిని నేను ప్రభువా నీ నుండి

“చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 9:15

పల్లవి : పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు

1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని – ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా – నా రక్షణ కర్తవు నీవైతివి
|| పొందితిని ||

2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని – అంధకారశక్తుల ప్రభావమునుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా – నీవే ఆశ్రయ దుర్గం బైతివి
|| పొందితిని ||

3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా – నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా – బహుగా దైర్యంబు నా కొసగితివి
|| పొందితిని ||

4. నా దేహమందున ముల్లు నుంచితివి – సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు – నీ కృపను నాకు దయచేసితివి
|| పొందితిని ||

5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని – కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా – జయజీవితము నాకు నేర్పించితివి
|| పొందితిని ||

నా ప్రభు ప్రేమించెను (2)

“నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను” గలతీ Galatians 2:20

పల్లవి : నా ప్రభు ప్రేమించెను (2)
నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
నాకై తానే అర్పించుకొనెను (2)

1. ప్రేమించెను నన్ను ప్రేమించెను – పరిమళ సువాసన ప్రభువాయెను
యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను
|| నా ప్రభు ||

2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను – సంఘమును క్రీస్తు ప్రేమించెను
దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను – తన ప్రాణమును అర్పించెను
|| నా ప్రభు ||

3. మొదటాయనే నన్ను ప్రేమించెను – తన్ను ప్రేమింపను నేర్పించెను
దేవుడే ప్రేమామయుడని తెల్పెను – ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను
|| నా ప్రభు ||

4. లోకమును ఎంతో ప్రేమించెను – కార్చెను రక్తము పాపులకై
కడిగెను నన్ను తన రక్తముతో – నాకై మరణము సహించెను
|| నా ప్రభు ||

5. ప్రభువా నిన్నే ప్రేమింతును – నీ నామమునే ప్రేమింతును
నీ రక్షణ నాకు ప్రియమైనది – నీ మందిరమున్ ప్రేమింతును
|| నా ప్రభు ||

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”