అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును   (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా
//అతి పరిశుద్ధుడా//
1. సర్వోన్నతమైన స్థలములు యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరి క్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి  (2)
//అతి పరిశుద్ధుడా//
2. సద్గుణరాశి నీ జాడలను
నా యెదుట నుంచుకొని
గడచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా  (2)
నా లోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2)
//అతి పరిశుద్ధుడా//
3. సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనివ్వక  (2)
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా  (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి  (2)
//అతి పరిశుద్ధుడా//

 


Ati Parishuddhuda sthuti naivedyamu | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023

Lyrics: English

Ati Parishuddhuda sthuti naivedyamu
Neeke arpinchi keerthintunu (2)
Neeku naa pakshamai nanu deevinchaga
Neeku naa toduvai nanu nadipinchaga
Jeevinthunu neekosame
aashrayamaina naa Yesayya
// Ati Parishuddhuda //

1. Sarvonnatamaina sthalamulu yandu
Nee mahima vivarimpaga
Unnatamaina nee sankalpamu
Ennadu aashcharyame (2)
Mundennaḍu chavichoodani
Sari krotthadaina premaamrutam (2)
Neelonē daachāvu eenātikai
Nee runam teeradu enaātiki (2)
// Ati Parishuddhuda //

2. Sadgunaraashi nee jaadalanu
Naa eduta nunchukoni
Gadachina kaalam saagina payanam
Nee krupaku sanketame (2)
Krupa vembadi krupa pondaga
Maarānu madhuramuga nē pondaga (2)
Naa lōna ē manchi choosāvayya
Nee prema choopitivi naa Yesayya (2)
// Ati Parishuddhuda //

3. Saarepai nunna paatraga nannu
Chejaari ponivvaka
Shodhanalennō edirinchinanu
Nanu soli ponivvaka (2)
Unnaavule prati kshanamunā
Kalisi unnaavule prati adugunā (2)
Neevegaa Yesayya naa oopiri
Neevegaa Yesayya naa kaapari (2)
// Ati Parishuddhuda //

దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా

“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14

పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా
నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా

1. దేవా నా రక్షణకర్త – నీవే నాసహాయుడవు
నన్ను దగనాడవలదు – నన్ను విడువకుము
|| దేవా నీ ||

2. నాదు తలిదండ్రులు – నన్ను విడచినను
నా దేవుండగు యెహోవా – నన్ను చేరదీయును
|| దేవా నీ||

3.నాకై పొంచియున్నట్టి – వారిని చూచి నన్ను
సరళ దారిని నడుపు – మంచి మార్గము భోధించు
|| దేవా నీ ||

4. నాపై లేచియున్నారు – అబద్ధ సాక్షులు క్రూరుల్
నన్నప్పగించకు దేవా – నాదు విరోధులకు
|| దేవా నీ ||

5. యెహోవా దయ పొందెదను – సజీవుల దేశమున
ఇట్టి నమ్మకము లేని – యెడల నే నేమగుదును
|| దేవా నీ ||

6. ధైర్యము తెచ్చుకొని – నిబ్బర హృదయము గల్గి
యెహోవా దేవుని కొరకు – కనిపెట్టుకొని యుండుము
|| దేవా నీ ||