hosanna ministries songs
నా వేదనలో వెదకితిని శ్రీయేసుని
నా వేదనలో వెదకితిని శ్రీయేసుని
నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై
1. వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)
2. నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)
ఆనందం యేసుతో ఆనందం
Aanandam yesutho aanandamu – ఆనందం యేసుతో ఆనందం
ఆనందం యేసుతో ఆనందం
జయగంభీర ధ్వనితో పాడెదను
జయరాజాధిరాజుతో సాగెదను
1. నా ప్రాణమునకు సేదదీర్చి
తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను
ఏ అపాయమునకు నేను భయపడకుందును
2. నా ప్రభుని కృప చూచిన
నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా
3. సిలువను యేసు సహించెను
తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై
అవమానము నొందె – నాకై మరణము గెలిచె
ప్రేమమయా – యేసు ప్రభువా
Premamaya Yesu Prabhuva | ప్రేమమయా – యేసు ప్రభువా
పల్లవి || ప్రేమమయా - యేసు ప్రభువా నిన్నే స్తుతింతును - ప్రభువా అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతింతును - ప్రభువా || ప్రేమ || చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || చ || ఎదవాకిటను - నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా హృదయాంగనములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే || ప్రేమ || చ || శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలముకొనినా శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమ ||
ఆనందమే ప్రభు యేసును
Anandhame Prabhu Yesunu (ఆనందమే ప్రభు యేసును)
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట
ఆత్మానంద గీతముల్ పాడెద.
సిలువలో నాకై రక్తము కార్చెను
సింహాసనమునకై నన్నును పిలిచెను
సింహపుకోరల నుండి నన్ను విడిపించెను
విశ్వాసమును కాపాడుకొనుచూ
విజయుడైన యేసుని ముఖమును చూచుచూ
విలువైన కిరీటము పొందెద నిశ్చయము
నా మానస వీణను మ్రోగించగా
నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే
నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు