రక్షకుని జన్మస్థలమా 

Rakshakuni Janmasthalama


Lyrics: Telugu

రక్షకుని జన్మస్థలమా
యూదయ బెత్లహేమా  (2)
ఆరాధనలకు ఆరంభమా
హృదయార్పణలకు నివాసమా  (2)
ఎందుకో ఇంత భాగ్యము
దాచిఉంచే ప్రభు నీకోసము (2)

స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును  (2) // రక్షకుని //

1. ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను
ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని  (2)
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రాప్తించగా
జన్మించే యేసు మహారాజుగా –
కాలము విడిపోయే రెండుగా (2)  // స్తుతియు //

2. నోటి మాటతో సృష్టిని
తనచేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై
పవళించెను పశువుల పాకలో  (2)
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీ కిచ్చెను
యూదా ప్రధానులందరిలో –
నీవు అల్పమైనదానవు కావు  (2)  // స్తుతియు //

3. దివిలోని దూతగణములు
సైన్య సమూహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపన్నునికి
స్తోత్ర గీతమే అర్పించిరి  (2)
సర్వలోక కల్యాణముకై
లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని –
అర్భాటించి కీర్తించెనుగా  (2)   // స్తుతియు //

4. రక్షకునిచూడవచ్చిన
ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను
అగోచరుడైన యేసువార్తలు  (2)
సింహ స్వప్నమై నిలిచెనుగా
సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి –
సాటిలేరని కొలిచిరిగా  (2)   // స్తుతియు //


Rakshakuni Janmasthalama |

Lyrics: English

Rakshakuni janmasthalamaa
Yoodaya Bethlehemaa (×2)
Aaraadhanakalaku aarambhamaa
Hrudayaarpanakalaku nivaasamaa (×2)
Enduko intha bhaagyamu
Daachi unche Prabhu neekosamu (×2)

Sthuthiyu mahima prabhaavamu
Ella velala Prabhuke chendunu (×2)
// Rakshakuni //

1. Pravachinche naadu pravakthalu
Kreestu janma shubhavaarthanu
Aashinche naadu kanyalu
Prabhuvuku janma nivvaalani (×2)
Thandri chittame neraveragaa
Kanya Mariyake praapthincha gaa
Janminche Yeshu Maharaajugaa –
Kaalamu vidipoyee reṇḍugaa (×2)
// Sthuthiyu //

2. Noti maatatho srushtini
Tanachetulatho ee manishini
Chesina Devudu deenudai
Pavarinchenu pashuvula paakalona (×2)
Nee charitranumaarche Devudu
Tana mahimanei neekichchenu
Yoodaa pradhaanalandarilo –
Neevu alpamainadaanavu kaavu (×2)
// Sthuthiyu //

3. Diviloni doothaganamulu
Sainya samuhamai digivachchiri
Sarvashakthi sampannuniki
Stotra geethame arpinchiri (×2)
Sarvaloka kalyaanamukai
Loka paapa pariharamukai
Digivachchina Yeshu poojyudani –
Arbaatinchi keerthinchenugaa (×2)
// Sthuthiyu //

4. Rakshakuni choodavachchina
Aa gollalu jnaanula sandaditho
Raajula gummamunu cherenu
Agocharudaina Yeshu vaarthalu (×2)
Simha swapnamai nilichenugaa
Simhaasanamulu adirenugaa
Shiramu vanchi Shrimantuniki –
Satilearani kolichirigaa (×2)
// Sthuthiyu //

Naa Praanamaa Naa Samasthamaa

Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu
Nee Koraku Naa Praanamu Dappigonuchunnadi

Naa Praanamaa Naa Samasthamaa
Prabhuni Sthuthiyinchumaa
Naa Yesu Chesina Mellanu Neevu Maruvakumaa – (2)        ||Naa Praanamaa||

Panikiraani Nanu Neevu Paiki Lepithivi
Kreesthane Bandapaina Nannu Nilipithivi (2)
Naa Adugulu Sthiraparachi Balamunichchithivi
Needu Adugu Jaadalane Vembadinthu Prabhu
Ne Vembadinthu Prabhu        ||Naa Praanamaa||

Andhakaarapu Loyalalo Nenu Nadachithini
Ye Apaayamu Raakundaa Nannu Nadipithivi (2)
Kantipaapaga Neevu Nannu Kaachithivi
Kanna Thandrivi Neevani Ninnu Kolichedanu
Ninnu Kolichedanu        ||Naa Praanamaa||

Needu Aathmatho Nindugaa Nannu Nimpu Prabhu
Aathma Phalamunu Dandigaa Neekai Phaliyinthunu (2)
Neevu Chesina Mellanu Nenetlu Marathu Prabhu
Nee Koraku Saakshigaa Ilalo Jeevinthunu
Ne Ilalo Jeevinthunu        ||Naa Praanamaa||

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది

నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2)      ||నా ప్రాణమా||

పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు            ||నా ప్రాణమా||

అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటిపాపగా నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
నిన్ను కొలిచెదను            ||నా ప్రాణమా||

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు
నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును            ||నా ప్రాణమా||