ఆశ్రయదుర్గము నీవని

ఆశ్రయదుర్గము నీవని
రక్షణ శృంగము నీవేనని
నా దాగుచోటు నీవేనని
నా సమస్తమును నీవేనని

నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక
నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు
మరణాంధకారములో బంధించబడిన నీ జనులను
మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు

నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా
నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు
కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు
ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు

నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక
నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు
ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను
జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు

సాగిపోదును

సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
సాగిపోదును నా యేసయ్యతో

ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును ||

నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును ||

శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును