యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు
యెడబాయని నీ కృపలో

నశించి పోయే నన్ను నీవు
ఎంతో ప్రేమతో ఆదరించి 2
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2
రక్షణ భాగ్యము నొసగితివే

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2
యెడబాయని నీ కృపలో

నా భారములు నీవే భరించి
నా నీడగా నాకు తోడైయుండి 2
చెదరిన నా హృది బాధలన్నిటిని 2
నాట్యముగానే మార్చితివే

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2
యెడబాయని నీ కృపలో

అనుదినము నీ ఆత్మలోనే
ఆనంద మొసగిన నా దేవా 2
ఆహా రక్షక నిన్ను స్తుతించెద 2
ఆనంద గీతము నేపాడి

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2
యెడబాయని నీ కృపలో

అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

పల్లవి:
అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)

1.
అబ్రహాము విశ్వాసముతొ – స్వ దేశము విడచెను

పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)

అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)
…అబ్రహాము…

2.
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను

వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)

ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)
…అబ్రహాము…

3.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను

యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X)

యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)