సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి

1. సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి
జయార్భాటము యెహోవాను గూర్చి చేయుడి

2. యెహోవా మహోన్నతమైన భయంకరుడు
మహారాజై యున్నాడు సకల జగమునకు

దేవుడే మనకాశ్రయమును

పల్లవి : దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు – ఆపదలో అనుపల్లవి : కావున భూమి – మార్పు నొందినను కొండలు మున్గినను – ఆపదలో ఆపదలో 1. సముద్ర జలములు – ఘోషంచుచు – నురుగు కట్టినను ఆ పొంగుకు పర్వతములు కదలినను – మనము – భయపడము || దేవుడే || 2. ఒక నది కలదు – దాని కాలువలు – దేవుని పట్టణమును సర్వోన్నతుని – మందిర పరిశుద్ధ స్థలమును – … Read more

కుమారి ఆలకించు – నీ వాలోచించి

పల్లవి : కుమారి ఆలకించు – నీ వాలోచించి
కుమారి చెవియొగ్గుము

అనుపల్లవి : మరువుము నీదు స్వంత జనమును
మరువుము నీదు తండ్రి యింటిని

నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము

పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా … నా … దేవా

1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా
|| నీ వెలుగు ||

నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు

పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది 1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను || నీటి వాగుల || 2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయె || నీటి వాగుల || 3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు దేవుని మందిరమునకు నడిపించితిని || నీటి వాగుల || … Read more

యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్

పల్లవి : యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్ నాశనమగు గుంటలో నుండియు జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను 1. నా పాదములను బండపై నిలిపి నా యడుగులు దానిపై స్థిరపచి క్రొత్త గీతమును నా నోట నుంచెను కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు || యెహోవా || 2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు దయామయా మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు … Read more

యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ

1. యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ నీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము 2. నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆ నా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది 3. నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను – ఆ పాపముచే నా యెముకలలో – స్వస్థత లేదు 4. నా దోషములు నా తలమీద – పొర్లిపోయినవి – … Read more

వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు

పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి 1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు || వ్యసనపడకుము || 2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు || వ్యసనపడకుము || 3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము … Read more

పిల్లలారా నా మాట వినుడి

పల్లవి : పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను 1. బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు || పిల్లలారా || 2. కపటమైన చెడుమాటలాడక కాచుకొనుము నీదు పెదవులను || పిల్లలారా || 3. కీడు మాని మేలునే చేయుము సమాధానము వెదకి వెంటాడు || పిల్లలారా || 4. యెహోవా దృష్టి నీతిమంతులపై కలదు వారి మొఱల వినును || పిల్లలారా || 5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి … Read more

సన్నుతింతు నెప్పుడెహోవాను

పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును 1. అతిశయింతు నెహోవానుబట్టి సంతోషింతురు దీనులు విని || సన్నుతింతు || 2.ఘనపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదము ఏకముగా || సన్నుతింతు || 3. తనయొద్ద నే విచారించగా తప్పించె నన్ను భయముల నుండి || సన్నుతింతు || 4. తనను చూడగ వెల్గు కలిగెను తమ ముఖములు లజ్జింపకుండె || సన్నుతింతు || 5. యెహోవా భక్తులందరి చుట్టు దూత కావలి … Read more