హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

“యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము.” కీర్తనలు Psalm 135:3

పల్లవి : హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద
1. సిలువలో నాకై రక్తము కార్చి
నన్ను రక్షించిన ఓ ప్రభువా
|| హల్లెలూయ ||

2. నిర్దోషమైన యేసుని రక్తము
నా పాపదోషమంత కడిగె
|| హల్లెలూయ ||

3. నీవు గావించిన బలియాగముకై
సాగిలపడి పూజించెదను
|| హల్లెలూయ ||

4. నా యడుగులను బండపై నిలిపి
స్థిరపరచి కాచితివి
|| హల్లెలూయ ||

5. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై
నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా
|| హల్లెలూయ ||

6. యెట్లుండగలను నీ పాట పాడక
పొంది యున్నట్టి మేలులకై
|| హల్లెలూయ ||

7. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో
ఆరాధించెద నిన్ను ప్రభువా
|| హల్లెలూయ ||

స్తుతులకు పాత్రుండవు

“నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను” నిర్గమ Exodus 3:4

పల్లవి : స్తుతులకు పాత్రుండవు
సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు

1. జీవపు రొట్టె వైతివి నీవే – తృప్తిపరచిన ప్రియుడవు నీవే
గొప్ప కార్యము చేయ – మా సామర్ధ్యము నీవే
|| స్తుతులకు ||

2. లోకమునకు వెలుగు నీవేగా – మా నేత్రముల తెరచితివిగా
అద్భుతము చేసితివి – మా ప్రకాశము నీవే
|| స్తుతులకు ||

3. ఏకైక ద్వారం మాకిల నీవే – ప్రవేశమిచ్చి రక్షించినావు
పూర్ణ క్రియ చేసితివి – సంపూర్ణ శాంతి నీవే
|| స్తుతులకు ||

4. మంచికాపరి మాకై నీవిల – ప్రాణంబు నిచ్చి రక్షించితివి
విడుదల చేసితివి – గొఱ్ఱెల నడిపెదవు
|| స్తుతులకు ||

5. పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
విజయంబు నిచ్చితివి – నూతన పరచితివి
|| స్తుతులకు ||

6. మార్గ సత్యము మాకిల నీవే – దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం – ఉన్నత స్థలమందుంచి
|| స్తుతులకు ||

7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే – నీ యందు నిలిచే తీగెలు మేము
లోతైన క్రియ చేసి – ఆత్మ ఫలమిచ్చితివి
|| స్తుతులకు ||

జై ప్రభు యేసు – జై ఘన దేవా

“విజయమందు మరణము మింగివేయబడెను” 1 కొరింథీయులకు Corinthians 15:54

పల్లవి : జై ప్రభు యేసు – జై ఘన దేవా
జై ప్రభు జై జై రాజా – జై ప్రభు జై జై రాజా
1. పాపకూపములో పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన
|| జై ప్రభు ||

2. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముని నీవు కడిగితివే
|| జై ప్రభు ||

3. నా శైలమై యేసు నన్నావరింపగా
యే శోధనైన గెల్చునా?
|| జై ప్రభు ||

4. కడు భీకరమగు తుఫానులలో
విడువక జయముగా నడుపుచున్న
|| జై ప్రభు ||

5. పసితనము నుండి ముదిమి వరకు
విసుగక ఎత్తు-కొను రక్షకా
|| జై ప్రభు ||

6. సమృద్ధుడు యేసు సహాయుడాయే
ఓ మృత్యువా! నీ ముల్లెక్కడ?
|| జై ప్రభు ||

7. సమాధి గెలిచిన విజయుడుండగ
సమాధి నీకు జయమగునా?
|| జై ప్రభు ||

హృదయ మర్పించెదము ప్రభునకు

“పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి.” రోమీయులకు Romans 12:1

పల్లవి : హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి

1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు
నిత్యజీవము నిచ్చెన్
|| హృదయ ||

2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
నిత్య నిరీక్షణ నిచ్చెన్
|| హృదయ ||

3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు
నిలువకు పాపములో
|| హృదయ ||

4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల
ఇదియే మా వినతి
|| హృదయ ||

అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై

“నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను.” యెషయా Isaiah 53:4

పల్లవి : అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి

1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా
|| అర్పింతు ||

2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం
నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో
|| అర్పింతు ||

3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు
ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే
|| అర్పింతు ||

4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను
|| అర్పింతు ||