మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) దీన మనస్సు – దయ గల మాటలు సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2) జడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||
Jesus Songs Telugu Lyrics
సమస్త దేశములారా అందరు పాడుడి
“యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును.” కీర్తన Psalm 100
పల్లవి : సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి
అనుపల్లవి : అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి
1. సంతోషముగను యెహోవాను సేవించుడి
ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి
|| సమస్త ||
2. యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడి
ఆయనే మనలను కలుగ జేసిన వాడు
|| సమస్త ||
3. మనమెల్లర మాయనకు ప్రజలమైతిమి
ఆయన మేపు గొఱ్ఱెలమై యున్నవారము
|| సమస్త ||
4. కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో
ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి
|| సమస్త ||
5. ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి
ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి
|| సమస్త ||
6. దయామయుండగు యెహోవా కృప నిత్యము
ఆయన సత్యము తరతరములుండును
|| సమస్త ||
రండి యెహోవానుగూర్చి
“రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము.” కీర్తన Psalm 95:1-8
పల్లవి : రండి యెహోవానుగూర్చి
సంతోష గానము చేయుదము
1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము
కృతజ్ఞతాస్తుతుల తోడ
|| రండి ||
2. మహా దేవుడు యెహోవా – దేవతలందరి పైన
మహాత్మ్యము గల మహారాజు
|| రండి ||
3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి
పర్వత శిఖరము లాయనవే
|| రండి ||
4. సముద్రమును భూమిని – తనదు చేతులు చేసెను
తన ప్రజలము గొఱ్ఱెలము మనము
|| రండి ||
5. యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదము
మనల సృజించిన దేవునికి
|| రండి ||
6. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల
ఎంత మేలు మనోహరము
దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి
|| దేవా ||
2. మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు
నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము
|| దేవా ||
3. డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము
అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును
|| దేవా ||
4. అయినను వాటి వైభవమంత – ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము
|| దేవా ||
5. నీకే జెందవలసినట్టి భయము – కొలది పుట్టినట్టి
నీదు ఆగ్రహ క్రోధ బలము – ఎవ్వరికి తెలియున్
|| దేవా ||
6. మాకు నీ జ్ఞాన హృదయమును – కలుగునట్లు చేయుము
మాదినములు లెక్కించుటకు – మాకు నీవే నేర్పుము
|| దేవా ||
ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము
2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు
గురునికి వారలు జనులుగా నుండెదరు
3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా
తన భక్తులకు రక్షణ సమీప మాయెను
4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి
నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి
5. భూలోకము లోనుండి సత్యము మొలుచు
నాకాశములోనుండి నీతి పారజూచును
6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును
ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును
7. ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా
ఆయన అడుగు జాడలలో మేము నడతుము