దేవా నా ఆర్తధ్వని

దేవా నా ఆర్తధ్వని వినవా

నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా

  1. గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా ||
  2. అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా|| దేవా ||

సర్వాధికారివి సర్వజ్ఞుడవు

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2||
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా ||2||


1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2||
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును ||2||   ||సర్వాధి||


2. బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును ||2||   ||సర్వాధి||


3. సర్వజగద్రక్షకూడా – లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా ||2||
బలమైన నీ రాజ్యస్థాపనకై  నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును ||2||   ||సర్వాధి||

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు
యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే
హల్లెలూయ  - ఉపకరములెన్నో చేసితివే 

నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే
నిత్యజీవము నే పొందుటకు - పునరుత్థానము నొందితివే
హల్లెలూయ - పునరుత్థానము నొందితివే 

నాకు ఐశ్వర్యము నిచ్చుటకే  - నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే

అదిగదిగో పరలోకము

అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)
అల్ఫా ఒమేగ యైన  నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే … పరిపూర్ణమైన పరిశుద్ధులతో (2)
                                         ” అదిగదిగో “
కల్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూ నే పరవసింతునే (2)
రాజాధిరాజు తో స్వప్నాల సౌధములో
విహరింతునే… నిర్మలమైన వస్త్రధారినై (2)
                                       ” అదిగదిగో “
జయించిన వాడై సర్వాధి కారియై
సింహాసనా సీనుడై నను చేర్చుకొనును (2)
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే  … వేవేల దూతల పరివారముతో (2)

మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)

కృపా సత్య సంపూర్ణమై

మా మధ్యలో నివసించుట న్యాయమా

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)

 

వినయముగల వారిని

తగిన సమయములో హెచ్చించువాడవని (2)

నీవు వాడు పాత్రనై నేనుండుటకై

నిలిచియుందును పవిత్రతతో (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)        ||మహా||

 

దీన మనస్సు గలవారికే

సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)

నీ సముఖములో సజీవ సాక్షినై

కాపాడుకొందును మెళకువతో (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||

 

శోధింపబడు వారికి

మార్గము చూపించి తప్పించువాడవని (2)

నా సిలువ మోయుచు నీ సిలువ నీడను

విశ్రమింతును అంతము వరకు (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||