ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం

పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది

1. దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు

|| ప్రవహించుచున్నది ||

2. దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు

|| ప్రవహించుచున్నది ||

3. జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు

|| ప్రవహించుచున్నది ||

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే

1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2||
నా నిత్యరక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2||     || నిత్యా ||

2. నా అభిషిక్తుడా నీ కృపావరములు
సర్వోత్తమమైన మార్గము చూపెనే ||2||
మర్మములన్నియు బయలుపరుచువాడా
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య ||2||    || నిత్యా ||

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే

నా గీతారాధనలో యేసయ్యా - నీ కృప ఆధారమే 
నా ఆవేదనలలో -  జనించెనే నీ కృపాదరణ 

నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే 
చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే 
నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే          || నా గీతా || 

చేనిలోని పైరు చేతికిరాకున్నా - ఫలములన్ని రాలిపోయినా 
సిరిసంపదలన్నీ దూరమైపోయినా - నేను చలించనులే 
నిశ్చలమైన రాజ్యముకొరకే - ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే       || నా గీతా || 

ఆత్మాభిషేకం - నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే 
ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే 
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు - నే వేచియుందునే నీ రాకడకై || నా గీతా ||

మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు (2)
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన||

నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా

1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె
నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే