శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత||

నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత||

దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత||

భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత||

సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2)       ||శాశ్వత||

నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)       ||శాశ్వత||

యేసు రాజు రాజుల రాజై

యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||

యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2)      ||హోసన్నా||

శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2)       ||హోసన్నా||

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2)       ||హోసన్నా||

నీటివాగుల కొరకు

Neeti vaagula Koraku | నీటివాగుల కొరకు

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు  నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది 
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా 
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా 

పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి 
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి 
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి 
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు || నా ప్రాణ || 

అంధకారపు లోయలలో నేను నడచితిని 
ఏ అపాయము రాకుండా నన్ను కాచితివి 
కన్నతండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను || నా ప్రాణ || 

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు 
ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును 
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు 
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును || నా ప్రాణ ||

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

ప్రణుతింతును నిన్నే- ఆశతీర
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె -2
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే -2
॥ ప్రాణేశ్వర ॥

2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను -2
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము -2
॥ ప్రాణేశ్వర ॥

3. కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన -2
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2
॥ ప్రాణేశ్వర ॥

నా ప్రాణ ప్రియుడవు నీవే

నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -2

ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము

ఎవ్వరు లేరు నాకిలలో -1

నా దేవా నా ప్రభువా – యేసు -2

నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -1

1. గాఢాంధ కారములో – నీవే నాకు దీపము -2

భీకర తుఫానులో – నీవే నాకు దుర్గము -2

॥ నా ప్రాణ॥

2. చీకు చింతలలో – కృంగి నేనుండగా -2

నా చెంతకు చేరి – నా చింతలు బాపితివే -2

॥ నా ప్రాణ॥