నా మనోనేత్రము తెరచి

“మీ మనో నేత్రములు వెలిగింపబడినందున” ఎఫెసీ Ephesians 1:17

పల్లవి : నా మనోనేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి (2)

అనుపల్లవి : అంధకారములో నేనుండ (2)
వెదకి నన్ రక్షించితివి (1)

1. నే పాప భారము తోడ – చింతించి వగయుచు నుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) – పొందినన్ విడిపించితివి (1)
|| నా మనోనేత్రము ||

2. వేరైతి లోకము నుండి – నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను – నీ స్వరమే నా స్వాస్థ్యమయా
|| నా మనోనేత్రము ||

3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? – నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో – ఓదార్చి ఆదుకొంటివయా
|| నా మనోనేత్రము ||

4. ఏమి నీ కర్పించగలను – ఏమీ లేని వాడనయ్యా
విరిగి నలిగిన హృదయముతో – అర్పింతు ఆత్మార్పణను
|| నా మనోనేత్రము ||

5. నీ సన్నిధిని నే కోరి – నీ సన్నిధిలో నేమారి
స్తుతి పాత్రగ ఆరాధింతున్ – యుగ యుగములు సర్వయుగములు
|| నా మనోనేత్రము ||

యేసు నీకే జయం జయము

“ఈయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాను” యోహాను John 4:42

పల్లవి: యేసు నీకే జయం జయము (2)
నీవె లోక పాల – కుడవు (2)
సర్వ సృష్టికి సృష్టి – కర్తవు
సర్వలోక రక్ష – కుడవు
జై జై అనుచు నీ – కే పాడెదం (2)

1. జన్మించె జగమున మా – నవ రూపములో
ప్రాయశ్చిత్తము – కై – తా – నె బలియాయె
పాపియైన మా – న – వుని రక్షింప
శిలువ నెక్కి తన ప్రా-ణము నిచ్చెన్
హల్లెలూయా భువిపైన (2)

2. మరణము ద్వారా – అంతమాయె బలులు
-త-న స-మా-ధి, సర్వం కప్పెన్
తిరిగి లే-చుటచే, సర్వం నూతనమాయె
సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి
హల్లెలూయా భువిపైన (2)

3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్
తండ్రి కుడిప్రక్కన, ఆ-యన కూర్చుండెన్
రాజుల రాజై, ప్రభువుల ప్రభువై
పొందె అధికారము – పరలోకముపై
హల్లెలూయా భువిపైన (2)

4. తన రూపమునకు మార్పు, నిష్ట-మాయె
సృష్టికంటె ముందు తానె సంకల్పించె
లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని
తన రూపము నొంది – తనతో-నుండెదం
హల్లెలూయా భువిపైన (2)