సాగిపోదును

సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును – ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును || నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును – నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును || శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును – మరి దేవుని … Read more

విజయ గీతము మనసార నేను పాడెద

విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ ఉత్తమమైన సంఘములో (2)        ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవినీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యమునీ పరిశుద్ధులలో చూపినది (2)        ||విజయ|| నూతన … Read more

నీ కృప నిత్యముండును

నీ కృప నిత్యముండునునీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నదిరక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లెకృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లెప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లెనీ … Read more

నా జీవితాన కురిసెనే

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం ||2|| నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ||2|| 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2|| కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను   ||2||      || నా జీవితాన || 2. నా యేసయ్యా – నీ నామమెంతో ఘనమైనది – కొనియాడదగినది ||2|| కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది   ||2||      || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు ||2|| కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను   ||2||      || నా జీవితాన ||

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2|| నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2|| 1. ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2|| అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే  మేలాయెనే ||2||  || నా అర్పణలు || 2. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2|| గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో షాలేము నీడయే నాకు మేలాయెనే ||2||  || నా అర్పణలు || 3. మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2|| మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2||  || నా అర్పణలు ||

పరుగెత్తెదా పరుగెత్తెదా

పరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2)   … Read more

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే  నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2|| నీవుగాక || అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2 స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2

నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప (2)విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు        ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయముఆదరించెనే శాశ్వత జీవముకై (2)మరువదే నన్నెల్లప్పుడూ కృపమాణిక్య మణులను మరిపించేనే కృప (2)మైమరచితినే నీ కృప తలంచినప్పుడు     ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యముచూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)ఆదుకునే నన్నెల్లప్పుడూ కృపశాంతి సమరము చేసెనే … Read more

నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో

నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో నా జీవితం – పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై – విలపించు సమయాన ఓదర్చువారే – కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 2. పూర్ణమనసుతో – పరిపూర్ణ ఆత్మతో పూర్ణబలముతో – ఆదరించెద నూతనసృష్టిగా – నన్ను మార్చినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 3. జయించిన నీవు – … Read more

ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం

పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది || 2. దురభిమానాలు దూరముచేసి యథార్థ జీవితం నీకనుగ్రహించును యేసురక్తము నిర్దోషమైనది నీవు ఆయన ఎదుటే నిలిచెదవు || ప్రవహించుచున్నది || 3. జీవజలముల నది తీరమున సకలప్రాణులు బ్రతుకుచున్నవి యేసురక్తము జీవింపజేయును నీవు ఆయన వారసత్వము పొందెదవు || ప్రవహించుచున్నది ||