నా ప్రభు ప్రేమించెను (2)

“నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను” గలతీ Galatians 2:20

పల్లవి : నా ప్రభు ప్రేమించెను (2)
నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
నాకై తానే అర్పించుకొనెను (2)

1. ప్రేమించెను నన్ను ప్రేమించెను – పరిమళ సువాసన ప్రభువాయెను
యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను
|| నా ప్రభు ||

2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను – సంఘమును క్రీస్తు ప్రేమించెను
దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను – తన ప్రాణమును అర్పించెను
|| నా ప్రభు ||

3. మొదటాయనే నన్ను ప్రేమించెను – తన్ను ప్రేమింపను నేర్పించెను
దేవుడే ప్రేమామయుడని తెల్పెను – ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను
|| నా ప్రభు ||

4. లోకమును ఎంతో ప్రేమించెను – కార్చెను రక్తము పాపులకై
కడిగెను నన్ను తన రక్తముతో – నాకై మరణము సహించెను
|| నా ప్రభు ||

5. ప్రభువా నిన్నే ప్రేమింతును – నీ నామమునే ప్రేమింతును
నీ రక్షణ నాకు ప్రియమైనది – నీ మందిరమున్ ప్రేమింతును
|| నా ప్రభు ||

మా ప్రభుయేసు నీవే మా సర్వము

“నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు” కీర్తన Psalm 36:8

పల్లవి : మా ప్రభుయేసు నీవే మా సర్వము
మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము

1. సంతృప్తి నీ మందిరమున గలదు
అందానంద ప్రవాహంబు మెరిసింది
వింతైన జీవపు యూటందు గలదు
యెంతైన మా పూజార్హుండ వీవే
|| మా ప్రభుయేసు ||

2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు
మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
సతతంబు మా పూజార్హుండ వీవే
|| మా ప్రభుయేసు ||

3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో
మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
యెక్కడైనా మా యేసు సన్నిధిలో
|| మా ప్రభుయేసు ||

4. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము
పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
పాలించుము ప్రభుయేసు రారాజ
|| మా ప్రభుయేసు ||

5. సోదర ప్రేమ సమాధానంబులతో
సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమాళాలతో
వినయంబున పూజింతుము నిన్ను
|| మా ప్రభుయేసు ||