దేవా, నా దేవుడవు నీవే

దేవా, నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును|2| నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను ||దేవా, నా దేవుడవు నీవే|| నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2| నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2| ||దేవా, నా దేవుడవు నీవే|| ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2| ||దేవా, నా దేవుడవు నీవే||

హల్లెలూయా -యేసయ్యా

హల్లెలూయా -యేసయ్యా -2 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు -3 దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు -3 ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 … Read more