స్తుతులకు పాత్రుండవు

“నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను” నిర్గమ Exodus 3:4

పల్లవి : స్తుతులకు పాత్రుండవు
సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు

1. జీవపు రొట్టె వైతివి నీవే – తృప్తిపరచిన ప్రియుడవు నీవే
గొప్ప కార్యము చేయ – మా సామర్ధ్యము నీవే
|| స్తుతులకు ||

2. లోకమునకు వెలుగు నీవేగా – మా నేత్రముల తెరచితివిగా
అద్భుతము చేసితివి – మా ప్రకాశము నీవే
|| స్తుతులకు ||

3. ఏకైక ద్వారం మాకిల నీవే – ప్రవేశమిచ్చి రక్షించినావు
పూర్ణ క్రియ చేసితివి – సంపూర్ణ శాంతి నీవే
|| స్తుతులకు ||

4. మంచికాపరి మాకై నీవిల – ప్రాణంబు నిచ్చి రక్షించితివి
విడుదల చేసితివి – గొఱ్ఱెల నడిపెదవు
|| స్తుతులకు ||

5. పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
విజయంబు నిచ్చితివి – నూతన పరచితివి
|| స్తుతులకు ||

6. మార్గ సత్యము మాకిల నీవే – దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం – ఉన్నత స్థలమందుంచి
|| స్తుతులకు ||

7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే – నీ యందు నిలిచే తీగెలు మేము
లోతైన క్రియ చేసి – ఆత్మ ఫలమిచ్చితివి
|| స్తుతులకు ||

జై ప్రభు యేసు – జై ఘన దేవా

“విజయమందు మరణము మింగివేయబడెను” 1 కొరింథీయులకు Corinthians 15:54

పల్లవి : జై ప్రభు యేసు – జై ఘన దేవా
జై ప్రభు జై జై రాజా – జై ప్రభు జై జై రాజా
1. పాపకూపములో పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన
|| జై ప్రభు ||

2. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముని నీవు కడిగితివే
|| జై ప్రభు ||

3. నా శైలమై యేసు నన్నావరింపగా
యే శోధనైన గెల్చునా?
|| జై ప్రభు ||

4. కడు భీకరమగు తుఫానులలో
విడువక జయముగా నడుపుచున్న
|| జై ప్రభు ||

5. పసితనము నుండి ముదిమి వరకు
విసుగక ఎత్తు-కొను రక్షకా
|| జై ప్రభు ||

6. సమృద్ధుడు యేసు సహాయుడాయే
ఓ మృత్యువా! నీ ముల్లెక్కడ?
|| జై ప్రభు ||

7. సమాధి గెలిచిన విజయుడుండగ
సమాధి నీకు జయమగునా?
|| జై ప్రభు ||