నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2|| నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2||     || నిత్యా || 2. నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే ||2|| మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య ||2||    || నిత్యా ||

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || చేనిలోని పైరు చేతికిరాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరిసంపదలన్నీ దూరమైపోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే – ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే … Read more

మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యామదిలోన జతగా నిలిచావు (2)హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసినీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకైసాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)సాహసక్రియలు చేయు నీ హస్తముతోనన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరిఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతోనన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన|| మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను … Read more

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె … Read more

నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనేఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)నా ప్రాణేశ్వరా యేసయ్యానా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడునీ వెలుగు నాపై ఉదయించెను (2)నీలోనే నేను వెలగాలనినీ మహిమ నాలో నిలవాలని (2)పరిశుద్ధాత్మ అభిషేకముతోనన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినానీ రక్తముతో కడిగితివి (2)నీతోనే నేను నడవాలనినీ వలెనే నేను మారాలని (2)పరిశుద్ధాత్మ వరములతోఅలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం|| తొలకరి వర్షపు జల్లులలోనీ పొలములోని నాటితివి (2)నీలోనే చిగురించాలనినీలోనే పుష్పించాలని (2)పరిశుద్ధాత్మ వర్షముతోసిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

నమ్మి నమ్మి… మనుషులను

నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు   1.రాజులను నమ్మి… బహుమతిని ప్రేమించిన – బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను నా యేసయ్యను నమ్మిన యెడలా – ఉన్నత బహుమానమూ – నీకు నిశ్చయమే నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు   … Read more

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును            “నేనె” నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! … Read more

భూమ్యాకాశములు సృజించిన

భూమ్యాకాశములు సృజించినయేసయ్యా నీకే స్తోత్రం (2)నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్నుదీన దశలో నేనుండగా నను విడువవైతివి (2)       ॥భూమ్యాకాశములు॥ జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్నుఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2)       ॥భూమ్యాకాశములు॥ భుజంగములను అణచివేసి కాచినావు నన్నుఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2)       ॥భూమ్యాకాశములు॥ నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివినిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2)       ॥భూమ్యాకాశములు॥

యూదా స్తుతి గోత్రపు సింహమా

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు … Read more

నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2) నీ కృపనే ధ్వజముగ నాపైన … Read more