మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)
దీన మనస్సు – దయ గల మాటలు
సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం||

ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని
బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)
నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు
ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)
ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను
ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

సమస్త దేశములారా అందరు పాడుడి

“యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును.” కీర్తన Psalm 100

పల్లవి : సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి

అనుపల్లవి : అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి

1. సంతోషముగను యెహోవాను సేవించుడి
ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి
|| సమస్త ||

2. యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడి
ఆయనే మనలను కలుగ జేసిన వాడు
|| సమస్త ||

3. మనమెల్లర మాయనకు ప్రజలమైతిమి
ఆయన మేపు గొఱ్ఱెలమై యున్నవారము
|| సమస్త ||

4. కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో
ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి
|| సమస్త ||

5. ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి
ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి
|| సమస్త ||

6. దయామయుండగు యెహోవా కృప నిత్యము
ఆయన సత్యము తరతరములుండును
|| సమస్త ||