యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో

పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది 1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ బాలుర స్తుతి స్తోత్రములతో స్థాపించితివి నీవొక దుర్గము నేదాగునట్లు ఆశ్రయ దుర్గము || యెహోవా || 2. నీ చేతి పనియైన ఆకాశమును చంద్ర నక్షత్రములనే చూడగా వాని దర్శించి జ్ఞాపకము చేయ మానవుండు ఏపాటివాడు || యెహోవా || 3. నీకంటె మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి మహిమ ప్రభావ కిరీటమును వానికి … Read more

యెహావా నా బలమా

పల్లవి : యెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా || యెహావా || 2. మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే || యెహావా || 3. పౌరుషముగల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను తననోటనుండి … Read more