పల్లవి: ఇదిగో నా జీవితం దేవా నికంకితం
బ్రతుకైనా చావైన నీకోసమే నాకున్నది నివోకడవే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయా ఆరాధింతును
నా పూర్ణ హృదయముతో నిన్ను ఘణపరుతును
నా జీవితాంతము యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య యేసయ్య
1) నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనేరుగక
శిధిలమైన శిలనై నేనుండగా నన్ను ప్రేమించగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి యేన్నాళ్లుగా నాకై వేచిఉన్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (ఇదిగో నా జీవితం)
2) దివ్యమైన స్నేహం నా మదిలోని కావ్యం
పరిమళించు పద్మం నీవేనయ్యా
ఊహల రెక్కలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానము నిచ్చితివి ఏమి చూచితివి
యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చేదను (ఇదిగో నా జీవితం)
3) స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధత లో
మహనీయుడ స్వర మండలము సితారతో
నిన్ను కీర్తింతును సద్గుణములకు నిలయం
నీవే సర్వాది పతులకు సారధి నీవే
దైవములనబడిన వారికి దేవుడవు మహా దేవుడవు (ఇదిగో నా జీవితం)
new christian prayer church
ఎల్ షద్దాయి – 2026 HOSANNA MINISTRIES – El Shaddai
ఎల్ షద్దాయి – El Shaddai (Lyrics)
పల్లవి: మహా ఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు మహిమాత్ముడా త్రిత్వమై జీవించువాడవు.. కీర్తించి మహిమ పరతును – స్తుతించి ఆరాధింతును నీకే నా ఆరాధన హల్లెలూయ
కోరస్: ఎలోహిం నీవే.. ఎల్ షద్దాయి దేవుడవు
ఎబినేజరువు నీవే.. స్తుతి ఘనత మహిమ నీకే
చరణం 1: నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా
విధినే ఛేదించి నీవు భువినే వెలిగించగా స్తుతినే
నా నోట పలికించి బహుగా దీవించగా గలమెత్తి కీర్తింతును.. ||ఎలోహిం నీవే||
చరణం 2: కొండైన లోయైన సమభూమి చేసేది నీవేగా
ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా
శ్రమలే నను వేధించినను
కలతలే బాధించినా కృపయే క్షణమైన విడువక
మహిమకే చేర్పించునని నిరీక్షించి కీర్తింతును.. ||ఎలోహిం నీవే||
చరణం 3: ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా
నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నీవే
భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు నీవే
సమాధాన ప్రభువై ఏలే మహారాజువని కీర్తించి ఘనపరతును.. ||ఎలోహిం నీవే||