ఇశ్రాయేలు కాపరి – Israel kaapari Song Lyrics | Hosanna Ministries

అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా (2)
ఇశ్రాయేలు కాపరి – బహుగొప్ప నేర్పరి
నీకు సాటియెవరు యేసయ్యా (2)

సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా (2)
సత్యవంతుడా మహాపరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా

చరణం :- 1
నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి (2)
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన (2)
మా పక్షమైయున్న – మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
( సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా )

చరణం :- 2
నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు (2)
విస్తారమైన నీ కృపలతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు (2)
విజయోత్సవముతో ఊరేగించెదవు
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
( సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా )

చరణం :- 3
సాత్వీకముతో – దీర్ఘశాంతముతో
విసుగక నాయెడల వాత్సల్యము చూపి (2)
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో నను దాటి వెళ్లక (2)
తల్లివలె ఒడిలో లాలించువాడవు
తీరని నీ రుణము వివరింపతరమా
( అబ్రహాము నమ్మిన )

English Lyrics :-

Abrahaamu Nammina Devudaa
Naa Pitharula Aaraadhya Daivamaa (2)
Ishraayelu Kaapari – Bahugoppa Nerpari
Neeku Saatiyevaru Yesayyaa (2)

Sahaayakudaa Nithyastothraarhudaa
Prabhaakarudaa Bahu Balavanthudaa (2)
Sathyavanthudaa Maha Parishuddhudaa
Aaraadhanaku Yogyudaa

Charanam – 1
Neeli Meghamunu Needagaa Maarchi
Agni Sthambhamunu Kaanthigaa Nilipi (2)
Sainyamulaku Neeve Saaradhigaa Nilichi
Ninginantina Godalu Kuppagaa Koolchina (2)
Maa Pakshamaiyunna Mahaaraajuvu Neeve
Neeku Saadhyamu Kaanidi Edayinaa Kaladaa
(Sahaayakudaa Nithyastothraarhudaa)

Charanam – 2
Niraashrayulaku Neeve Nithyaashrayamai
Niraashala Needanu Tholaginchedavu (2)
Visthaaramaina Nee Krupalatho Nimpi
Nissaaramaina Bratukunu Maarchaedavu (2)
Vijayotsavamutho Ooreginchedavu
Neeku Saadhyamu Kaanidi Edayinaa Kaladaa
(Sahaayakudaa Nithyastothraarhudaa)

Charanam – 3
Saathveekamutho Deergha Shaanthamutho
Visugaka Naayedala Vaathsalyamu Choopi (2)
Ontarigaa Nanu Ennadu Viduvaka
Vedhanalo Nanu Daati Vellaka (2)
Thallivale Odilo Laalinchuvaadavu
Theerani Nee Runamu Vivarimpa Tharamaa
(Abrahaamu Nammina)


Recent songs

నేనొక పరదేశిని | nenuoka paradesini

పల్లవి: నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని-నేనొక పరదేశిని
పరలోకమే నా పౌరసత్వము -ప్రభువే నాకు స్థిరవాసము 2
||నేనొక||

1,ఎక్కడివాడనో ఇక్కడి బ్రతుకున -ఆరాటపడుతున్న ఆశాజీవిని 2
అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి 2
||నేనొక||

2,ఏముంది ఇలలో ఇదిఒక మజిలీ -ఈ గుడారములో మూల్గు చుoటిని 2
క్షణికమైన జీవితం క్షయమైపోవును -యేసుక్రీస్తులోనే నిత్యజీవము 2

||నేనొక||

3,విశ్వాసమును కాపాడుకొని -క్రీస్తులో నాపరుగు కడముట్టించెదను 2
సాక్షి సమూహములో నే చేరెదను- నీతి కిరీటమును ధరియించెదను2

||నేనొక||


Recent songs